...
...
Next Story

Bank holiday today : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్- ఈరోజు బ్యాంకులకు సెలవు..

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం, సెప్టెంబర్ 4, 2026న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం సెలవుల వివరాలు, డిజిటల్ సేవల లభ్యతపై ప్రత్యేక కథనం..

Published on: Sep 4, 2026, 06:45:35 IST
Advertisement

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని శుక్రవారం (సెప్టెంబర్ 4) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన అధికారిక పండుగల సెలవుల జాబితా ప్రకారం.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో పాటు అనేక కీలక నగరాల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.

ఈరోజు బ్యాంక్ హాలీడే- పూర్తి వివరాలు..
ఈరోజు బ్యాంక్ హాలీడే- పూర్తి వివరాలు..

అయితే, ఈ హాలిడే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఒకే రకంగా వర్తించదు. ఆయా రాష్ట్రాల సంస్కృతి, పండుగల ప్రాముఖ్యత ఆధారంగా ఆర్బీఐ ప్రాంతీయ సెలవులను ఖరారు చేస్తుంది. ఈ క్రమంలో జన్మాష్టమిని అధికారిక పండుగ సెలవుగా పరిగణించని మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, గోవా, కేరళ వంటి ప్రాంతాల్లో బ్యాంకులు శుక్రవారం యథాతథంగా పనిచేస్తాయి.

ఏ ఏ నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి?

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 4న కింద పేర్కొన్న ప్రధాన నగరాల్లో బ్యాంక్ శాఖలు మూతపడతాయి:

తెలుగు రాష్ట్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా ఇతర ప్రాంతాలు

ఉత్తర, పశ్చిమ భారతదేశం: అహ్మదాబాద్, భోపాల్, ఛండీగఢ్, జైపూర్, కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్, శిమ్లా, రాయ్‌పూర్

తూర్పు, ఈశాన్య భారతదేశం: కోల్‌కతా, పట్నా, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్, ఐజ్వాల్

దక్షిణాది నగరాలు: చెన్నై, తిరువనంతపురం, శ్రీనగర్

ఈ జాబితా ప్రకారం గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని ప్రజలు తమ బ్యాంకింగ్ పనులను వాయిదా వేసుకోవడం లేదా డిజిటల్ మార్గాల ద్వారా పూర్తి చేసుకోవడం మంచిది. చెక్కుల డిపాజిట్, లాకర్ల వినియోగం, పత్రాల సమర్పణ వంటి ప్రత్యక్ష సేవలు కావాల్సిన ఖాతాదారులు ముందుగానే తమ స్థానిక బ్రాంచ్ పనిదినాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

బ్రాంచ్‌లు మూతపడినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి.

యూపీఐ : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా జరిపే నగదు బదిలీలు సజావుగా సాగుతాయి.

నెట్, మొబైల్ బ్యాంకింగ్: ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ చెల్లింపులు చేసుకోవచ్చు.

ఏటీఎం సేవలు: నగదు ఉపసంహరణ, క్యాష్ డిపాజిట్ మెషిన్లు (సీడీఎం) ఎప్పటిలాగే పనిచేస్తాయి.

శ్రీకృష్ణ జన్మాష్టమి 2026 విశిష్టత..

ఈ ఏడాది సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి జయంతిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ధర్మాన్ని పరిరక్షించి, అధర్మాన్ని నాశనం చేయడానికి విష్ణుమూర్తి ఎనిమిదొవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. జన్మాష్టమి రోజున భక్తులు ఉపవాసాలు ఉండటం, కృష్ణుడి జన్మ ఘట్టాన్ని స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేయడం సాంప్రదాయం. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన జీవన సందేశం మానవాళికి నిత్య మార్గదర్శకంగా నిలుస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks