Bank holidays in July : అలర్ట్! జులై 2026లో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు..

July bank holidays list : బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక! జులై 2026లో బ్యాంకులు ఏకంగా 12 రోజుల పాటు మూతపడి ఉంటాయి. వివిధ ఈవెంట్లు, స్థానిక పండుగలు, వారాంతపు సెలవులు కలుపుకుని బ్యాంకులు 12 రోజులు పని చేయవు. కస్టమర్లు, ఈ లిస్ట్​ని తెలుసుకుని బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Published on: Jun 30, 2026, 10:28:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివిధ పనుల మీద నిత్యం బ్యాంకులకు వెళ్లే వారికి అలర్ట్! జులై 2026కి సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్​ వచ్చేసింది. జులైలో బ్యాంకులు వివిధ సందర్భాల్లో మొత్తం మీద 12 రోజుల పాటు మూతపడి ఉండనున్నాయి. వీటిలో వారాంతపు సెలవులు, కొన్ని స్థానిక పండుగలు, ఈవెంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జులై బ్యాంకు సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

జులై బ్యాంకు సెలవుల జాబితా ఇదిగో..
జులై బ్యాంకు సెలవుల జాబితా ఇదిగో..

జులై 2026లో బ్యాంకు సెలవుల వివరాలు..

జులై 6, సోమవారం- ఎంహెచ్​ఐపీ డే కారణంగా ఐజ్వాల్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 9, గురువారం- బెహ్ దైన్​ఖ్లామ్ కారణంగా షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 16, గురువారం- జగన్నాథ రథయాత్ర. కంగ్, హరేలా నేపథ్యంలో భువనేశ్వర్​- ఒడిశాలో, ఇంఫాల్, డెహ్రాడూన్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 17, శుక్రవారం- యూ టిరోట్ సింగ్​ వర్థంతి కారణంగా షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 18, శనివారం- ద్రుప్​కా షీ-జే కారణంగా గ్యాంగ్​టక్​లోని బ్యాంకులకు సెలవు.

జులై 22, బుధవారం- ఖర్చీ పూజ నేపథ్యంలో అగర్తలాలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

వీటితో పాటు..

జులై 5- ఆదివారం

జులై 11- రెండో శనివారం

జులై 12- ఆదివారం

జులై 19- ఆదివారం

జులై 25- నాల్గొవ శనివారం

జులై 26- ఆదివారం నాడు బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉంటాయి.

జులై బ్యాంకు సెలవులు- ఇవి పనిచేస్తాయి..

సెలవు దినాల్లో బ్యాంకు బ్రాంచీలు ఫిజికల్​గా మూతపడినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు డిజిటల్ సేవలు ఎల్లప్పుడు అందుబాటులోనే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు 24 గంటలూ సజావుగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకోవాలి.

ఖాతాదారులు ఒకరికొకరు డబ్బులు పంపించుకోవడానికి లేదా పేమెంట్లు చేయడానికి గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్​ యాప్స్, పేటీఎం లేదా ఆయా బ్యాంకులకు చెందిన అధికారిక యాప్స్​ని ఉపయోగించుకోవచ్చు.

అలాగే ఏటీఎం సర్వీసు ద్వారా నగదు ఉపసంహరణ సైతం చేసుకోవచ్చు. కేవలం డిమాండ్ డ్రాఫ్ట్, చెక్‌బుక్ క్లియరెన్స్ వంటి ఇన్-బ్రాంచ్ సేవలు మాత్రం కస్టమర్లు బ్యాంకులు తిరిగి తెరుచుకునేంత వరకు వేచి చూడాలి.

అందుకే.. జులై 2026 బ్యాంకు సెలవుల లిస్ట్​ని చూసుకుంటే, అందుకు తగ్గట్టు మీరు మీ బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More