...
...
Next Story

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 27 నుంచి 29 వరకు ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే కొద్ది రోజుల్లో తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

Published on: Oct 23, 2026, 16:01:26 IST
Advertisement

బంగాళాఖాతంలో కదలికలు వేగవంతమయ్యాయి. తూర్పుమధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే కొద్ది రోజుల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

తీవ్ర తుపానుగా మారే క్రమం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 27 నుంచి 29 వరకు ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు (ఫైల్ ఫోటో)
బంగాళాఖాతంలో అల్పపీడనం.. 27 నుంచి 29 వరకు ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు (ఫైల్ ఫోటో)

ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 25న తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26 (సోమవారం) ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందుతుంది.

ఆ తర్వాత రెండు రోజుల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అక్టోబర్ 27 నుంచి అత్యంత భారీ వర్షాలు

ఈ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి 29 మధ్య ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వర్షపాత హెచ్చరికలను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్: తీరాంధ్ర ప్రాంతంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఒడిశా: అక్టోబర్ 28న అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. అక్టోబర్ 27, 29 తేదీల్లో భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.

రాబోయే తుపాను పేరు 'అర్నాబ్'

ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపానుల నామకరణ పట్టిక ప్రకారం.. ఈ తుపానుకు 'అర్నాబ్' (Arnab) అని పేరు పెట్టనున్నారు. ఈ పేరును బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. బెంగాలీ భాషలో 'అర్నాబ్' అంటే 'సముద్రం' అని అర్థం. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), ఐఎండీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రాంతీయ తుపానుల జాబితా ఆధారంగా ఈ నామకరణం ఖరారైంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks