...
...
Next Story

హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్.. టీమిండియా 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్.. మొత్తం 22 మ్యాచ్‌లు

ఇండియన్ క్రికెట్ టీమ్ 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మన హైదరాబాద్ లో వెస్టిండీస్ తో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి.

Published on: Mar 26, 2026, 15:40:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న టీమిండియా 2026-27 హోమ్ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా గురువారం (మార్చి 26) అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త సీజన్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఏకంగా 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు ఆడబోతోంది. వీటిలో అక్టోబర్ 14న వెస్టిండీస్ తో టీ20, జనవరి 6న జింబాబ్వేతో వన్డే మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుండటం విశేషం.

వెస్టిండీస్ సిరీస్‌తో మొదలు..

హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్.. టీమిండియా 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఇలా (AFP)
హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్.. టీమిండియా 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఇలా (AFP)

ముందుగా ఈ సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌తో ఈ హోమ్ సీజన్ చాలా గ్రాండ్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ టూర్‌లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడి వచ్చిన వెంటనే.. మళ్లీ మన ఇండియాలో మ్యాచ్‌ల పండగ మొదలవుతుంది. ఈ సీజన్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మార్చి 3 వరకు జరగనుంది.

అంతేకాకుండా ఈ బిజీ షెడ్యూల్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌ల మధ్యలో జింబాబ్వే, శ్రీలంక జట్లతో కూడా వన్డే, టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా టూర్‌కు వచ్చే వెస్టిండీస్ జట్టు ముందుగా మూడు వన్డేలు, ఆ తర్వాత ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. త్రివేండ్రం, గువాహటి, ముల్లాన్‌పూర్‌లలో వన్డేలు జరగనుండగా.. లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో టీ20 మ్యాచ్‌లు జరగబోతున్నాయి.

శ్రీలంక, జింబాబ్వే టూర్స్ ఇలా..

డిసెంబర్ 2026లో శ్రీలంక జట్టు ఇండియాకు వస్తుంది. వాళ్లతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఉంటుంది. ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలు వన్డేలకు ఆతిథ్యం ఇస్తుండగా.. రాజ్‌కోట్, కటక్, పుణేలలో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.

చివరిగా అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ఈ సీజన్ ఓ రేంజ్‌లో ముగుస్తుంది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్ నాగ్‌పూర్‌లో మొదలవుతుంది. ఆ తర్వాత చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్‌లలో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి.

క్రికెట్‌లో రెండు టాప్ జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వడం ఖాయం. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2001లో ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్‌కు వేదికైన కోల్‌కతా.. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు.

టీమిండియా 2026-27 హోమ్ సీజన్ పూర్తి షెడ్యూల్

వెస్టిండీస్ ఇండియా టూర్

సెప్టెంబర్ 27: ఫస్ట్ వన్డే, త్రివేండ్రం

సెప్టెంబర్ 30: సెకండ్ వన్డే, గువాహటి

అక్టోబర్ 3: థర్డ్ వన్డే, ముల్లాన్‌పూర్

అక్టోబర్ 6: ఫస్ట్ టీ20, లక్నో

అక్టోబర్ 9: సెకండ్ టీ20, రాంచీ

అక్టోబర్ 11: థర్డ్ టీ20, ఇండోర్

అక్టోబర్ 14: ఫోర్త్ టీ20, హైదరాబాద్

అక్టోబర్ 17: ఫిఫ్త్ టీ20, బెంగళూరు

శ్రీలంక ఇండియా టూర్

డిసెంబర్ 13: ఫస్ట్ వన్డే, న్యూఢిల్లీ

డిసెంబర్ 16: సెకండ్ వన్డే, బెంగళూరు

డిసెంబర్ 19: థర్డ్ వన్డే, అహ్మదాబాద్

డిసెంబర్ 22: ఫస్ట్ టీ20, రాజ్‌కోట్

డిసెంబర్ 24: సెకండ్ టీ20, కటక్

డిసెంబర్ 27: థర్డ్ టీ20, పుణే

జింబాబ్వే ఇండియా టూర్

జనవరి 3: ఫస్ట్ వన్డే, కోల్‌కతా

జనవరి 6: సెకండ్ వన్డే, హైదరాబాద్

జనవరి 9: థర్డ్ వన్డే, ముంబై

ఆస్ట్రేలియా ఇండియా టూర్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

జనవరి 21 నుంచి 25 వరకు: ఫస్ట్ టెస్ట్, నాగ్‌పూర్

జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు: సెకండ్ టెస్ట్, చెన్నై

ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు: థర్డ్ టెస్ట్, గువాహటి

ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు: ఫోర్త్ టెస్ట్, రాంచీ

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు: ఫిఫ్త్ టెస్ట్, అహ్మదాబాద్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks