సొంత గడ్డపై సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు బీసీసీఐ కళ్లు చెదిరే బహుమతిని ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు ఏకంగా రూ. 131 కోట్ల భారీ క్యాష్ రివార్డ్‌ను అందజేయనున్నట్లు మంగళవారం (మార్చి 10) అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఈ క్యాష్ రివార్డ్ ఎవరెవరికి దక్కుతుందంటే?

మెగా టోర్నీలు గెలిచినప్పుడు జట్టుకు భారీ నజరానాలు ఇవ్వడం బీసీసీఐకి ఆనవాయితీగా వస్తోంది. ఈ తాజా రూ. 131 కోట్ల బోనస్‌ను ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, నేషనల్ సెలెక్టర్ల మధ్య పంచుతారు. ఆ లెక్కన అందరూ జాక్ పాట్ కొట్టినట్లే. గతంలో ఏ మెగా టోర్నీ గెలిచిన సందర్భంలోనూ ఈస్థాయిలో బీసీసీఐ క్యాష్ ప్రైజ్ ఇవ్వలేదు.
గత కొన్నేళ్లలో బీసీసీఐ ఇచ్చిన భారీ రివార్డ్స్
2024 టీ20 వరల్డ్ కప్: రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్ గెలిచిన జట్టుకు రూ. 125 కోట్లు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ: మరుసటి ఏడాదే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు టీమిండియాకు రూ. 58 కోట్లు.
2025 విమెన్స్ వన్డే వరల్డ్ కప్: ట్రోఫీ సాధించిన భారత మహిళల జట్టుకు రూ. 51 కోట్లు.
గౌతమ్ గంభీర్, సూర్యలకు ప్రశంసలు
ఈ అద్భుతమైన విజయంపై బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ స్పందిస్తూ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. "పురుషుల టీ20 వరల్డ్ కప్ గెలవడం యావత్ దేశానికే ఎంతో గర్వకారణం. సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగి, టైటిల్ నిలబెట్టుకోవడం మరింత స్పెషల్. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో, సూర్యకుమార్ యాదవ్ లీడర్‌షిప్‌లో టోర్నీ ఆసాంతం జట్టు అద్భుతంగా ఆడింది. ఈ అపురూప విజయం సాధించిన ప్రతి ప్లేయర్‌కు, కోచింగ్ స్టాఫ్‌కు, సెలెక్టర్లకు నా ప్రత్యేక అభినందనలు," అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వరల్డ్ కప్‌లో సూర్య సేన రికార్డులు ఇవే..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచుల్లో 8 గెలిచి అన్-స్టాపబుల్‌గా నిలిచింది. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లో 90 వేల మంది ఫ్యాన్స్ కేరింతల మధ్య జరిగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో పలు సంచలన రికార్డులు చేరాయి.
{{/usCountry}}సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచుల్లో 8 గెలిచి అన్-స్టాపబుల్‌గా నిలిచింది. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లో 90 వేల మంది ఫ్యాన్స్ కేరింతల మధ్య జరిగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో పలు సంచలన రికార్డులు చేరాయి.
{{/usCountry}}టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 2007లో ఎంఎస్ ధోనీ, 2024లో రోహిత్ శర్మ, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్.. ఇలా మొత్తంగా మూడు టీ20 వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక జట్టుగా టాప్‌లో నిలిచింది. హోస్ట్ నేషన్‌గా (ఆతిథ్య దేశంగా) ఉండి టీ20 వరల్డ్ కప్ గెలవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. గతంలో ఏ హోస్ట్ నేషన్ కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోయింది.