Mahindra cars discounts : మహీంద్రా కార్లపై డిస్కౌంట్ల జాతర! ఈ మోడల్స్‌పై అదిరే ఆఫర్లు..
మే 2026 నెలలో మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు థార్ రాక్స్, స్కార్పియో వంటి మోడళ్లపై నగదు డిస్కౌంట్లు, యాక్సెసరీస్ ప్రయోజనాలను అందిస్తోంది.
మే 2026లో కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు, సేల్స్‌ని పెంచుకునేందుకు వివిధ ఆటోమొబైల్ సంస్థ తమ పోర్ట్‌ఫోలియోలోని వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తాజాగా చేరింది. ఈ ఆఫర్లలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బోర్న్ ఎలక్ట్రిక్ (బీఈ) సిరీస్, పాత మోడళ్లపై కంపెనీ భారీగా రాయితీలు ఇస్తోంది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎలక్ట్రిక్ వాహనాలపై ‘ఎలక్ట్రిఫైయింగ్’ ఆఫర్లు!
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు ఈ నెల పండుగే అని చెప్పాలి!
ఎక్స్‌యూవీ 400 ఈవీ : కంపెనీ ఈ మోడల్‌లోని ఈసీ ప్రో, ఈఎల్ ప్రో వేరియంట్లపై గరిష్టంగా రూ. 2.5 లక్షల నగదు తగ్గింపును ఇస్తోంది. INGLO ప్లాట్‌ఫారమ్ ఆధారిత కొత్త ఎలక్ట్రిక్ కార్ల రాకతో దీనిపై పోటీ పెరగడమే ఈ భారీ డిస్కౌంట్‌కు ప్రధాన కారణం.
బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ: గత ఏడాది (ఎంవై2025) స్టాక్‌ను క్లియర్ చేసేందుకు గానూ బీఈ 6 పై రూ. 2 లక్షలు, ఎక్స్ఈవీ 9ఈపై రూ. 1.4 లక్షల మేర క్యాష్ డిస్కౌంట్ని మహీంద్రా అందిస్తోంది. ప్రస్తుతం ఇవి దేశంలోనే టాప్ సెల్లింగ్ ఈవీలుగా ఉన్నందున, ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వాహనాలపై ఆఫర్లు..
సాధారణ ఇంధన కార్లపై కూడా మహీంద్రా ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది:
థార్ రాక్స్ : ఈ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీపై మొత్తంగా రూ. 1,10,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ. 85,000 నగదు తగ్గింపు కాగా, రూ. 25,000 విలువైన యాక్సెసరీస్ లభిస్తాయి.
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ : ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ. 40,000 నగదు, రూ. 20,000 యాక్సెసరీలతో కలిపి మొత్తం రూ. 60,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
స్కార్పియో సిరీస్: స్కార్పియో క్లాసిక్ కొంటే రూ. 50,000 (రూ. 20 వేల నగదు + రూ. 30 వేల యాక్సెసరీస్) వరకు లబ్ధి చేకూరుతుంది. స్కార్పియో-ఎన్ మోడల్‌లో జెడ్4 వేరియంట్‌పై రూ. 30,000, జెడ్8 వేరియంట్‌పై రూ. 20,000 తగ్గింపు ఉంది.
బొలెరో నియో: దీనిపై రూ. 25,000 నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.
అయితే, బొలెరో సిరీస్, త్రీ-డోర్ థార్, ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ మోడళ్లపై ఈ నెల ఎటువంటి ఆఫర్లు లేవు.
ఇక ఈ డిస్కౌంట్లు కేవలం ఎంపిక చేసిన నగరాల్లో, స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని మహీంద్రా డీలర్‌ను సంప్రదించడం ఉత్తమం.
తరచూ అడిగే ప్రశ్నలు-
ప్రశ్న 1: ఈ నెలలో ఏ మహీంద్రా కారుపై అత్యధికంగా డిస్కౌంట్ లభిస్తోంది?
సమాధానం: మహీంద్రా XUV 400 EV మోడల్‌పై గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు భారీ నగదు తగ్గింపు లభిస్తోంది. అలాగే BE 6, XEV 9e వంటి కొత్త తరం ఎలక్ట్రిక్ కార్ల 2025 మోడల్ స్టాక్‌పై కూడా రూ. 2 లక్షల వరకు రాయితీలు ఉన్నాయి.
ప్రశ్న 2: థార్ రాక్స్, స్కార్పియో మోడళ్లపై లభించే ప్రయోజనాలు ఏంటి?
సమాధానం: థార్ రాక్స్‌పై నగదు, యాక్సెసరీస్ కలిపి రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుండగా, స్కార్పియో క్లాసిక్‌పై రూ. 50,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. స్కార్పియో-ఎన్ మోడల్‌లోని జెడ్4, జెడ్8 వేరియంట్లపై రూ. 30,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


