భారత ఆటోమొబైల్ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు నిస్సాన్ ప్రయోగించిన అస్త్రం “గ్రావైట్”! ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ, 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీ. లాంచ్ అయినప్పటి నుంచి ఈ మోడల్‌పై మంచి బజ్ నెలకొంది. మరి మీరు కూడా ఈ నిస్సాన్ గ్రావైట్‌ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్‌లో నిస్సాన్ గ్రావైట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో నిస్సాన్ గ్రావైట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..

నిస్సాన్ గ్రావైట్ విసియా- రూ. 6.72 లక్షలు
అసెంటా- రూ. 7.82 లక్షలు
ఎన్- కనెక్టా- రూ. 8.54 లక్షలు
ఎన్- కనెక్టా ఈజెడ్ షిఫ్ట్- రూ. 9.24 లక్షలు
టెక్నా- రూ. 9.37 లక్షలు
టెక్నా లాంచ్ ఎడిషన్- రూ. 9.90 లక్షలు
టెక్నా ఈజెడ్ షిప్ట్- రూ. 10.06 లక్షలు
టెక్నా లాంచ్ ఎడిషన్ ఈజెడ్ షిఫ్ట్- రూ. 10.58 లక్షలు
అంటే హైదరాబాద్‌లో ఈ 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవీ నిస్సాన్ గ్రావైట్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 6.72 లక్షల నుంచి రూ. 10.58 లక్షల వరకు ఉంటుందని అర్థం. ఈ ప్రైజ్ పాయింట్లోనే 7 సీటర్ వెహికిల్ రావడం మధ్యతరగతి ప్రజలకు నిజంగానే మంచి ఆప్షన్ అవుతుంది!
సాధారణంగా ఆటోమొబైల్ సంస్థలు ఏదైనా వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో, దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్సులు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే, ఏదైనా కారు కొనే ముందు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను కూడా తెలుసుకుని బడ్జెట్ వేసుకోవడం ఉత్తమం.
మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే టెస్ట్ డ్రైవ్‌తో పాటు లాంచ్ ఆఫర్ల గురించి కూడా తెలుసుకుని బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
నిస్సాన్ గ్రావైట్ డెలివరీ ఎప్పటి నుంచి?
{{/usCountry}}మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే టెస్ట్ డ్రైవ్‌తో పాటు లాంచ్ ఆఫర్ల గురించి కూడా తెలుసుకుని బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
నిస్సాన్ గ్రావైట్ డెలివరీ ఎప్పటి నుంచి?
{{/usCountry}}నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో ఈ వెహికిల్‌ని బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చ్ 2026లో మొదలయ్యే అవకాశం ఉంది.
నిస్సాన్ గ్రావైట్ వేరియంట్లు- వాటి ఫీచర్ల వివరాలను డీటైల్డ్‌గా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ మైలేజ్ ఎంత?
ఈ నిస్సాన్ గ్రావైట్లో 1.0లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇస్తుంది. దీనిని మేన్యువల్ గేర్‌బాక్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు 19.3 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తుందని, అదే ఏఎంటీకి కనెక్ట్ చేసినప్పుడు 19.6 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తుందని సంస్థ వెల్లడించింది.
నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ సేఫ్టీ ఫీచర్స్ ఎంటి?
ఈ 7 సీటర్, అఫార్డిబుల్ ఎంపీవీలో 45 యాక్టివ్- పాసివ్ సఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. పైగా అన్ని వేరియంట్లలో 30కిపైగా ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. వాటిల్లో కొన్ని.. 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, యాంటీ- లాక్ బ్రేకింగ్ సిస్టెమ్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్.