Kia Sonet facelift : వచ్చేస్తోంది కొత్త కియా సోనెట్.. అదిరిపోయే ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Kia Sonet facelift : కియా ఇండియా తన న్యూ జనరేషన్ సోనెట్‌ను 2027లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్త ప్లాట్‌ఫారమ్, భారీ స్క్రీన్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో ఈ కారు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించనుంది. పూర్తి వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..
2027 Kia Sonet : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటి.. కియా సోనెట్. ఇక ఇప్పుడు ఈ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తీసుకొచ్చేందుకు కియా మోటార్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. 2027లో మార్కెట్లోకి రానున్న ఈ కొత్త తరం సోనెట్ (కోడ్ నేమ్: QY2E), డిజైన్ పరంగానే కాకుండా సాంకేతికత పరంగా కూడా భారీ మార్పులతో రాబోతోందని సమాచారం.

కియా సోనెట్ తొలిసారిగా సెప్టెంబర్ 2020లో విడుదలై, జనవరి 2024లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అందుకుంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయి కొత్త మోడల్‌తో వినియోగదారులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్- కొత్త ప్లాట్‌ఫారమ్, ఎక్కువ స్పేస్..
ప్రస్తుతం సోనెట్ కే2 అనే ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుండగా, కొత్త మోడల్ కే1 ప్లాట్‌ఫారమ్‌కు మారనుంది. ఇది కియా సైరోస్‌లో ఉపయోగించిన ప్లాట్‌ఫారమే. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, సోనెట్‌లో ప్రధాన ఉన్న ‘వెనుక సీటు ఇరుకుగా ఉండటం’ అనే సమస్య ఇప్పుడు పరిష్కారం కానుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ తరహాలోనే సోనెట్ వీల్‌బేస్ కూడా పెరగడం వల్ల వెనుక కూర్చునే ప్రయాణికులకు లెగ్ రూమ్, షోల్డర్ రూమ్ అధికంగా లభిస్తాయి.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్- హైబ్రిడ్ ఇంజిన్!
పాత ఇంజిన్లు అయిన 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ కొనసాగుతాయి. అయితే, అసలు విశేషం ఏంటంటే.. కియా ఈ మోడల్ కోసం స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను డెవలప్ చేస్తోంది. ఇది కారు లాంచ్ అయిన వెంటనే కాకుండా, 2028 లేదా 2029 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్- నెక్ట్స్ లెవల్ ఫీచర్స్..
కొత్త సోనెట్ ఎస్‌యూవీలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారు:
పెద్ద స్క్రీన్లు: ప్రస్తుతం ఉన్న 10.25- ఇంచ్ స్క్రీన్ల స్థానంలో భారీ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు రానున్నాయి.
లెవల్ 2 అడాస్: ప్రస్తుతం ఉన్న కెమెరా-ఆధారిత లెవల్ 1 అడాస్ స్థానంలో, కెమెరా, రాడార్‌తో కూడిన మరింత సురక్షితమైన లెవల్ 2 అడాస్ సిస్టమ్ రాబోతోంది.
భద్రత: కే1 ప్లాట్‌ఫారమ్‌లో హై-స్ట్రెంత్ స్టీల్ వాడటం వల్ల భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించడమే లక్ష్యంగా కియా పనిచేస్తోంది.
టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి గట్టి పోటీదారులను ఎదుర్కోవడానికి కియా ఈ కొత్త అస్త్రంతో సిద్ధమవుతోంది. ఏడాదికి సుమారు 85,000 యూనిట్ల ఉత్పత్తిని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. కొత్త కియా సోనెట్ ఎప్పుడు విడుదలవుతుంది?
కొత్త కియా సోనెట్ 2027లో భారత మార్కెట్లో విడుదల కానుంది.
2. సోనెట్ హైబ్రిడ్ వెర్షన్ ఎప్పుడు వస్తుంది?
హైబ్రిడ్ వెర్షన్ కారు లాంచ్ అయిన వెంటనే రాదు. ఇది 2028 లేదా 2029 మధ్యలో వచ్చే అవకాశం ఉంది.
3. వెనుక సీట్ల స్థలం పెరుగుతుందా?
అవును, కొత్త కే1 ప్లాట్‌ఫారమ్, పెరిగిన వీల్‌బేస్ కారణంగా వెనుక సీట్లలో ప్రయాణికులకు ఎక్కువ లెగ్ రూమ్ లభిస్తుంది.
4. కొత్త సోనెట్ సేఫ్టీ రేటింగ్ ఎంత ఉండవచ్చు?
కియా ఈ కొత్త మోడల్ కోసం భారత్ ఎన్సీఏపీలో 5-స్టార్ రేటింగ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


