How to check Cibil score for free : భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ యూపీఐ వ్యవస్థ కేవలం లావాదేవీలకే పరిమితం కాకుండా, 'క్రెడిట్ సేవలను' (అప్పు పొందే సదుపాయం) సామాన్యులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2026, ఏప్రిల్ 20న ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం దీనికి నిదర్శనం. దీని ద్వారా భీమ్ యూపీఐ యాప్ వినియోగదారులు తమ సిబిల్ స్కోర్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను (సీఐఆర్) యాప్‌లోనే పొందవచ్చు.
భీమ్ యూపీఐ యాప్‌లో సిబిల్ స్కోర్- ఆర్థిక అక్షరాస్యత దిశగా అడుగులు..

గతంలో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే ప్రత్యేక వెబ్‌సైట్లను సందర్శించడమో లేదా రుసుము చెల్లించడమో చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భీమ్ యూపీఐ యాప్‌లో ఈ ఫీచర్ రావడం వల్ల రోజువారీ ఆర్థిక కార్యకలాపాల్లో భాగమైపోయింది.
గ్రామీణ భారతంపై దృష్టి: పట్టణ ప్రాంతాల వారికే పరిమితమైన క్రెడిట్ అవగాహనను, ఇప్పుడు గ్రామీణ, అర్ధ-పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశ్యం.
ఆర్థిక ప్రణాళిక: కేవలం లావాదేవీలు చేయడమే కాకుండా, భవిష్యత్తులో లోన్లు లేదా క్రెడిట్ కార్డులు కావాలనుకునే వారు తమ ఆర్థిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు.
"భారత్ ఇప్పుడు లావాదేవీల దశ నుంచి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక దశకు మారుతోంది. మిలియన్ల మంది వినియోగదారులకు సిబిల్ స్కోర్ అందుబాటులోకి రావడం అనేది వినియోగదారుల అవగాహన ప్రయాణంలో ఒక కీలక మలుపు," అని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ అండ్ సీఈఓ భవేష్ జైన్ పేర్కొన్నారు.
భీమ్ యూపీఐ యాప్‌లో సిబిల్ స్కోర్- భద్రత, గోప్యత..
డిజిటల్ యుగంలో డేటా భద్రత అత్యంత కీలకం. భీమ్ యాప్‌లో సిబిల్ స్కోర్ పొందే ప్రక్రియ పూర్తిగా ‘కన్సెంట్ బేస్డ్’ మోడల్‌లో సాగుతుంది. అంటే:
- వినియోగదారుడు స్పష్టంగా అనుమతి ఇస్తే తప్ప క్రెడిట్ డేటా చెక్ చేయడం కుదరదు.
- నిబంధనల ప్రకారం వినియోగదారుడి సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుంది.
మీ సిబిల్ స్కోర్‌ని ఉచితంగా ఎలా చూడాలి?
భీమ్ యాప్ వెర్షన్ 4.0.19 అంతకంటే పై వెర్షన్ వాడుతున్న వారు ఈ కింది విధానంలో తమ స్కోర్‌ను తెలుసుకోవచ్చు:
{{/usCountry}}భీమ్ యాప్ వెర్షన్ 4.0.19 అంతకంటే పై వెర్షన్ వాడుతున్న వారు ఈ కింది విధానంలో తమ స్కోర్‌ను తెలుసుకోవచ్చు:
{{/usCountry}}యాప్ ఓపెన్ చేయండి: మీ భీమ్ యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌లో కిందకు స్క్రోల్ చేస్తే 'Free CIBIL Score' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
వివరాల పరిశీలన: దానిపై క్లిక్ చేయగానే డేటా ప్రైవసీ, స్కోర్ చెక్ లిమిట్‌కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.
డేటా ఎంట్రీ: మీ పాన్ కార్డ్ వివరాలు, మీ మొదటి పేరు, చివరి పేరును నమోదు చేయండి.
ప్రక్రియ పూర్తి: నిబంధనలు, షరతులను అంగీకరించి 'Proceed' పై క్లిక్ చేయండి.
ఫలితం: వెనువెంటనే మీ సిబిల్ స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీని ద్వారా మీ క్రెడిట్ హిస్టరీని మీరు రిపోర్ట్ రూపంలో కూడా చూడవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. భీమ్ యూపీఐ యాప్‌లో సిబిల్ స్కోర్ చూడటానికి డబ్బులు కట్టాలా?
లేదు, ఈ సేవను భీమ్ యాప్ వినియోగదారులందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
2. సిబిల్ స్కోర్ చెక్ చేయడం వల్ల స్కోర్ తగ్గుతుందా?
లేదు. మీరు సొంతంగా మీ స్కోర్‌ను చెక్ చేసుకోవడాన్ని 'సాఫ్ట్ ఎంక్వైరీ' అంటారు. దీనివల్ల మీ సిబిల్ స్కోర్ ఏమాత్రం తగ్గదు. బ్యాంకులు మీ స్కోర్ చూసినప్పుడు మాత్రమే అది 'హార్డ్ ఎంక్వైరీ'గా పరిగణించిన స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.
3. సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం?
మీరు ఏదైనా బ్యాంకులో లోన్ (పర్సనల్, హోమ్ లేదా వెహికల్ లోన్) తీసుకోవాలన్నా లేదా క్రెడిట్ కార్డు కావాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకుంటాయి. మంచి స్కోర్ (750+) ఉంటే లోన్ త్వరగా, తక్కువ వడ్డీకే లభించే అవకాశం ఉంటుంది.