ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త 'ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్' మోడల్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ఎంట్రీ-లెవెల్ లగ్జరీ ఎస్‌యూవీ శ్రేణిలో మరింత విశాలమైన వెర్షన్‌ను తాజాగా స్థానిక పోర్ట్‌ఫోలియోకు జోడించింది. చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో ఈ కారును పూర్తిగా దేశీయంగానే తయారు చేస్తున్నారు. దీని ఇంట్రొడక్టరీ ఎక్స్‌షోరూం ప్రైజ్ రూ. 49.90 లక్షలుగా నిర్ణయించి బుకింగ్‌లను ప్రారంభించారు. అదనపు క్యాబిన్ స్పేస్, అత్యాధునిక పరికరాలు ఈ కారు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ- డైమెన్షన్స్..

ఈ బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్డబ్ల్యూబీలో అత్యంత ముఖ్యమైన మార్పు ఎక్స్టెండెడ్ వీల్‌బేస్! ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ మోడల్ పొడవు 4,616 ఎంఎం, వెడల్పు 2,104 ఎంఎం, ఎత్తు 1,641 ఎంఎంగా ఉంది. దీని వీల్‌బేస్ 2,800 ఎంఎంగా వస్తుంది.
స్టాండర్డ్ ఎక్స్1 మోడల్‌తో పోలిస్తే ఈ లాంగ్ వీల్‌బేస్ వెర్షన్ మరింత పెద్దదిగా ఉంటుంది. దీనివల్ల వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మరో 150 ఎంఎం లెగ్‌రూమ్, 109 ఎంఎం నీ-రూమ్ అదనంగా లభిస్తుంది. అంతేకాకుండా వెనుక సీట్లలో 15 ఎంఎం అదనపు కుషనింగ్, 28.5 డిగ్రీల వరకు రిక్లైన్ చేసే సదుపాయం కల్పించారు. లగేజ్ కోసం ఇందులో 540 లీటర్ల స్థలం ఉంది. వెనుక సీట్లను మడతపెడితే ఈ సామర్థ్యం ఏకంగా 1,700 లీటర్లకు పెరుగుతుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ- అప్‌డేటెడ్ క్యాబిన్..
ఈ ఎస్‌యూవీలో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, కార్నరింగ్ ఫంక్షనాలిటీ, బీఎండబ్ల్యూ హై బీమ్ అసిస్టెంట్ ఉన్నాయి. అలాగే 18 అంచుల ఎం లైట్ అలాయ్ వీల్స్, అల్యుమినీయం ఫినిష్డ్ రూఫ్ రెయిల్స్, 3డీ ఎల్ఈడీ టెయిల్-లైట్లు దీని లుక్‌ను మరింత పెంచుతాయి.
క్యాబిన్ లోపల వైడ్‌స్క్రీన్ కర్వ్డ్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేసుకునే ఫ్రంట్ స్పోర్ట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, వర్టికల్ వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ ఇచ్చారు. 9 చదరపు అడుగుల విస్తీర్ణం గల పనోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్లతో కూడిన 205డబ్ల్యూ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ- పెట్రోల్ ఇంజిన్ పనితీరు..
{{/usCountry}}క్యాబిన్ లోపల వైడ్‌స్క్రీన్ కర్వ్డ్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేసుకునే ఫ్రంట్ స్పోర్ట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, వర్టికల్ వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ ఇచ్చారు. 9 చదరపు అడుగుల విస్తీర్ణం గల పనోరమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్లతో కూడిన 205డబ్ల్యూ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ- పెట్రోల్ ఇంజిన్ పనితీరు..
{{/usCountry}}బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ మోడల్‌లో 1.5-లీటర్ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 156 బీహెచ్‌పీ పవర్‌ని, 270 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సెవెన్-స్పీడ్ స్టెట్రోనిక్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది ఫ్రంట్ వీల్స్‌కు పవర్‌ను సరఫరా చేస్తుంది.
ఈ లగ్జరీ కారు లీటరుకు 15.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కారు బ్యాలెన్స్ కోసం 50:50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ప్రత్యేకంగా ట్యూన్ చేసిన కంఫర్ట్ సస్పెన్షన్ సెటప్‌ను ఇందులో వాడారు.
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎల్‌డబ్ల్యూబీ- డిజిటల్ అప్‌గ్రేడ్‌లు..
ఈ కారులో లేటెస్ట్ ఐడ్రైవ్ వెర్షన్‌తో కూడిన బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 9ని అందించారు. క్విక్‌సెలెక్ట్ ఇంటర్‌ఫేస్ ద్వారా కీలక ఫంక్షన్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా ఎప్పటికీ అప్‌డేటెడ్‌గా ఉండవచ్చు. మైబీఎమ్‌డబ్ల్యూ యాప్ సహాయంతో కారు సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందవచ్చు. డిజిటల్ కీ ప్లస్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లను కారు తాళంలా వాడుకోవచ్చు. ఈ డిజిటల్ కీని గరిష్టంగా 18 మంది వినియోగదారులతో షేర్ చేసుకోవచ్చు.
భద్రత విషయానికి వస్తే.. లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, బ్రేకింగ్ ఫంక్షన్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్స్ భద్రతను మరింత బలోపేతం చేస్తాయి. పార్కింగ్ అసిస్టెంట్, రివ్యూ కెమెరా స్టాండర్డ్ ఫీచర్లుగా రాగా.. పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ 360-డిగ్రీ సరౌండ్-వ్యూ సిస్టమ్‌ను అందిస్తుంది.