ప్రపంచ ప్రసిద్ధ విమానాల తయారీ దిగ్గజం ‘బోయింగ్’ మళ్లీ లేఆఫ్స్ బాట పట్టింది! కొత్త విమానాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వేళ, తమ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ విభాగంలో దాదాపు 5 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సంస్థ తాజాగా అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 2,500 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ వంటి భారతీయ విమానయాన సంస్థలకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల డెలివరీలు ఎంతో కీలకం. ఈ క్రమంలో బోయింగ్ సంస్థలో మళ్లీ సంక్షోభం ముదిరి ఉద్యోగాల కోత విధించడం గ్లోబల్ ఏవియేషన్ రంగాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.
ఫ్యాక్టరీ స్థిరత్వం కోసమే ఉద్యోగుల కుదింపు
కంపెనీ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ విభాగం అధిపతి స్టెఫానీ పోప్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు.
"మా ఫ్యాక్టరీలు, సప్లై చైన్ భాగస్వాములకు స్థిరత్వం కల్పించడానికి ఉత్పత్తి వేగాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం వచ్చింది. తయారీ షెడ్యూళ్లను మార్చడం, విమానాల అవుట్‌పుట్‌ను తగ్గించడం వల్ల ప్రస్తుతం అవసరానికి మించి సిబ్బంది ఉన్నట్లు స్పష్టమైంది," అని స్టెఫానీ పోప్ తెలిపారు.
ఈ ఉద్యోగాల కోత ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభ కానుంది. పెరిగిన సిబ్బందిని తగ్గించేందుకు సహజ నిష్క్రమణలు (అట్రిషన్‌లు), అలాగే నిర్బంధ తొలగింపులు (ఇన్వాలెంటరీ లేఆఫ్స్) రెండింటినీ ఉపయోగించనున్నారు.
అమెరికాలోని అనేక రాష్ట్రాల చట్టాల ప్రకారం ఉద్యోగులకు 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
2026 ఉత్పత్తి లక్ష్యాలు నీరుగారిపోయాయి!
బోయింగ్ సీఈఓ కెల్లీ ఆర్ట్‌బర్గ్ ఇటీవలే మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వేదికగా మాట్లాడుతూ.. 2026 నాటికి నిర్దేశించుకున్న 737 జెట్‌లైనర్ ఉత్పత్తి, డెలివరీ లక్ష్యాలను అందుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
"మేము వేగంగా ముందుకు సాగాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఉత్పత్తిని పెంచేటప్పుడు క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంది," అని సీఈఓ కెల్లీ ఆర్ట్‌బర్గ్ పేర్కొన్నారు.
{{/usCountry}}"మేము వేగంగా ముందుకు సాగాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఉత్పత్తిని పెంచేటప్పుడు క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంది," అని సీఈఓ కెల్లీ ఆర్ట్‌బర్గ్ పేర్కొన్నారు.
{{/usCountry}}గతంలో 2026 వేసవి నాటికి నెలకు 47 ప్రొడక్షన్ రేట్ అందుకోవాలని బోయింగ్ భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని 2027 ప్రారంభానికి వాయిదా వేసింది. అలాగే 2028 నాటికి 10 బిలియన్ డాలర్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించాలనే లక్ష్యం కూడా 2029కి చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
737, 787 విమానాల సిరీస్‌లో కొనసాగుతున్న ఆటంకాలు..
బోయింగ్ సంస్థకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే 737 నారోబాడీ విమానాల విక్రయాలు మందగించడం కంపెనీ కోలుకోవడానికి పెద్ద అడ్డంకిగా మారింది. మరోవైపు ప్రాచుర్యం పొందిన 787 వైడ్‌బాడీ విమానాల ఉత్పత్తిని నెలకు 8 నుంచి 10కి పెంచడంలోనూ సంస్థ ఇబ్బందులు పడుతోంది. 767, 777 విమానాల అసెంబ్లీ లైన్లలోనూ రవాణా ఆటంకాలు ఎదురవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
సియాటిల్ కేంద్రంగా పనిచేస్తున్న బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ విభాగంలో 2025 డిసెంబర్ నాటికి 50,494 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 5 శాతం అంటే దాదాపు 2,500 మందిపై ఈ వేటు పడనుంది.
గత 2024లో అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 విమానం డోర్ ప్యానెల్ గాల్లో ఊడిపోయిన ఘటన, ఆ తర్వాత మెకానిక్‌లు జరిపిన నిరవధిక సమ్మె వల్ల బోయింగ్ ఏకంగా 17,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ ఘోర సంక్షోభం నుంచి తేరుకోకముందే మళ్లీ వేలాది మందిని లేఆఫ్ చేయడం సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక గండానికి అద్దం పడుతోంది.