...
...
Next Story

మెయిన్ బోర్డు వైపు బొండాడ ఇంజనీరింగ్: ఎన్ఎస్ఈ నుంచి గ్రీన్ సిగ్నల్

బీఎస్ఈ ఎస్ఎమ్‌ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి మెయిన్ బోర్డులోకి మారేందుకు బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నుంచి ఇన్-ప్రిన్సిపల్ అనుమతి లభించింది. ఇప్పటికే బీఎస్ఈ అనుమతి దక్కగా, ఎన్ఎస్ఈ ఆమోదంతో కంపెనీ క్యాపిటల్ మార్కెట్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

Published on: Oct 15, 2026, 16:16:56 IST
Advertisement

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ సంస్థ 'బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్' (BSE: 543971) క్యాపిటల్ మార్కెట్లో మరొక అత్యంత కీలకమైన మైలురాయిని అధిగమించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఎస్ఎమ్‌ఈ (SME) వేదిక నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ (మెయిన్ బోర్డు)లోకి మారేందుకు ఎన్ఎస్ఈ నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. ఈ మేరకు అక్టోబర్ 14, 2026 నాటి లేఖ ద్వారా ఎన్ఎస్ఈ తమ ఆమోదాన్ని తెలిపిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

రెండు ప్రధాన ఎక్స్ఛేంజీల మెయిన్ బోర్డుల్లోకి..

మెయిన్ బోర్డు వైపు బొండాడ ఇంజనీరింగ్: ఎన్ఎస్ఈ నుంచి గ్రీన్ సిగ్నల్
మెయిన్ బోర్డు వైపు బొండాడ ఇంజనీరింగ్: ఎన్ఎస్ఈ నుంచి గ్రీన్ సిగ్నల్

ఇప్పటికే 2026 సెప్టెంబర్ 9న బీఎస్ఈ మెయిన్ బోర్డు మైగ్రేషన్‌కు సంబంధించి బొండాడ ఇంజనీరింగ్‌కు సూత్రప్రాయ అనుమతి లభించింది. ఇప్పుడు ఎన్ఎస్ఈ నుంచి కూడా ఆమోదం లభించడంతో దేశంలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీల మెయిన్ బోర్డుల్లో తమ ఉనికిని చాటుకునేందుకు సంస్థకు మార్గం సుగమమైంది.

ఈ పరిణామం క్యాపిటల్ మార్కెట్లో కంపెనీ విజిబిలిటీని, మార్కెట్ ప్రాభవాన్ని గణనీయంగా పెంచుతుందని యాజమాన్యం ఆశిస్తోంది. నియంత్రణ సంస్థలు, స్టాక్ ఎక్స్ఛేంజీల నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియలను పూర్తి చేసి మైగ్రేషన్ పూర్తి చేయనున్నట్లు తెలిపింది.

సీఎండీ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు స్పందన ఇదీ

ఈ కీలక పరిణామంపై బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు స్పందిస్తూ.. "ఎన్ఎస్ఈ మెయిన్ బోర్డు మైగ్రేషన్‌కు అనుమతి రావడం మా కంపెనీ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. బీఎస్ఈ అనుమతి తర్వాత ఎన్ఎస్ఈ ఆమోదం కూడా లభించడం రెండు ఎక్స్ఛేంజీలలో మా బలాన్ని ప్రతిబింబిస్తోంది. పునరుత్పాదక ఇంధనం (Renewable Energy), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) వంటి ప్రాధాన్యత కలిగిన రౌండ్ ది క్లాక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో నిలకడైన వృద్ధిని సాధించేందుకు మేము కట్టుబడి ఉన్నాం" అని పేర్కొన్నారు.

రూ. 7 కోట్ల నుంచి రూ. 2,843 కోట్ల సామ్రాజ్యంగా..

సౌర విద్యుత్, బీఈఎస్ఎస్ (BESS), టెలికాం, రైల్వేలు, డేటా సెంటర్లు, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, గ్రీన్ కన్స్ట్రక్షన్ ఉత్పత్తులు, పారిశ్రామిక ఎల్ఈడీ లైటింగ్, బీఎల్డీసీ మోటార్ల ఉత్పత్తి రంగాల్లో ఈ సంస్థ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC), ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M) సేవలను అందిస్తోంది. స్వచ్ఛమైన ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, రవాణా రంగాల్లో భారత్ పురోగతికి ఈ సంస్థ నిరంతరం తోడ్పాటునందిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks