...
...
Next Story

బడ్జెట్ 2026: రియల్ ఎస్టేట్ రంగం ఆశలేంటి? ఇన్‌ఫ్రా, మెట్రో కనెక్టివిటీ

2026 కేంద్ర బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ దిగ్గజాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. మెట్రో కనెక్టివిటీ, గ్రీన్ బిల్డింగ్స్, పన్ను మినహాయింపుల ద్వారా నగర జీవన ప్రమాణాలను పెంచాలని జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, ఏఎస్‌బీఎల్ సీఈవోలు కోరుతున్నారు.

Published on: Jan 23, 2026, 06:57:40 IST
Advertisement

కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కీలకమైన రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగం భారీ అంచనాలతో ఉంది. ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో అత్యాధునిక జీవనశైలిని, సుస్థిర అభివృద్ధిని కాంక్షిస్తున్న డెవలపర్లు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల అధినేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మౌలిక సదుపాయాలే రియల్ ఎస్టేట్ చోదక శక్తులు: కార్తీష్ రెడ్డి (GHR Infra సీఈవో)

బడ్జెట్ 2026: రియల్ ఎస్టేట్ రంగం ఆశలేంటి? ఇన్‌ఫ్రా, మెట్రో కనెక్టివిటీ
బడ్జెట్ 2026: రియల్ ఎస్టేట్ రంగం ఆశలేంటి? ఇన్‌ఫ్రా, మెట్రో కనెక్టివిటీ

ప్రీమియం, జీవనశైలి ఆధారిత నిర్మాణాలకు మౌలిక సదుపాయాలే అసలైన విలువను చేకూరుస్తాయని జీహెచ్ఆర్ ఇన్ఫ్రా (GHR Infra) సీఈవో కార్తీష్ రెడ్డి పేర్కొన్నారు.

"జీవన ప్రమాణాలను పెంచేలా నాణ్యమైన రవాణా వ్యవస్థ, సామాజిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూల ప్రమాణాల కోసం ఈ బడ్జెట్‌లో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. సుస్థిర నిర్మాణ పద్ధతులు, ఇంధన పొదుపు డిజైన్లకు ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు లభిస్తే.. తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే మెటీరియల్స్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, నీటి సంరక్షణ వంటి అంశాలను మేము మరింత వేగంగా అమలు చేస్తాం. విలాసవంతమైన జీవనానికి ఎలాంటి లోటు లేకుండానే పర్యావరణాన్ని కాపాడటం మా లక్ష్యం" అని ఆయన వివరించారు.

జీహెచ్ఆర్ ఇన్ఫ్రా (GHR Infra) సీఈవో కార్తీష్ రెడ్డి

నగర శివార్లలో కనెక్టివిటీ పెరుగుతున్న ప్రాంతాలకు బడ్జెట్‌లో మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెట్రో విస్తరణ కోసం 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్', ఇంధన పొదుపు భవనాలకు పన్ను రాయితీలు ఇస్తే.. అది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని కార్తీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కనెక్టివిటీ, సుస్థిరతే కీలకం: అజితేష్ కోరుపోలు (ASBL వ్యవస్థాపకులు & సీఈవో)

"నగర స్థాయి మౌలిక సదుపాయాలైన రహదారులు, మెట్రో కారిడార్లు, పౌర వసతులు, నీటి నిర్వహణపై నిరంతర పెట్టుబడులు అవసరం. ఇవి నేరుగా ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తాయి. భూమి కేటాయింపులు, పన్నులు, సింగిల్ విండో క్లియరెన్స్‌ల విషయంలో స్పష్టమైన, ఊహించదగ్గ విధానాలు ఉంటే.. మేము భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కమ్యూనిటీలను నిర్మించగలం" అని అజితేష్ పేర్కొన్నారు.

ఏఎస్‌బీఎల్ (ASBL) వ్యవస్థాపకులు, సీఈవో అజితేష్ కోరుపోలు

స్మార్ట్ సిటీ జోన్‌లలో స్టాంప్ డ్యూటీ రాయితీలు, గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన కోరారు. రవాణా ఆధారిత అభివృద్ధి (Transit-oriented development) కి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, తద్వారా ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe