బుల్డోజర్ రాజ్.. ఖమ్మం ఇళ్ల కూల్చివేతపై కేరళమ్ సీఎం పినరయి విజయన్‌ సీరియస్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేరళమ్ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా స్పందించారు. బుల్డోజర్‌ రాజ్‌ పాలన సాగిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Mar 2, 2026, 19:42:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కేరళమ్ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఫిబ్రవరి 25న ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో 700 ఇళ్లను కూల్చివేసి 3,000 మందిని ఇళ్ల నుండి ఖాళీ చేయించినట్లు వచ్చిన వార్తలపై కేరళమ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీరియస్ అయ్యారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు దీనికి ఆయన కేరళమ్‌లోని కాంగ్రెస్ నాయకత్వం నుండి సమాధానం కోరారు.

కేరళమ్ సీఎం పినరయి విజయన్
కేరళమ్ సీఎం పినరయి విజయన్

భూదాన్ ఉద్యమంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు కేటాయించిన వినోభా నగర్‌లోని ఇళ్లను కూల్చివేయడంపై పినరయి విజయన్ మండిపడ్డారు. ఇళ్లను కూల్చివేసి, భూదాన ఉద్యమ నాయకుడు ఆచార్య వినోబా భావే వారసత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం అపవిత్రం చేసిందని విజయన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ మాదిరిగానే బుల్డోజర్ రాజ్ పాలనను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందని ఆరోపించారు.

వెలుగుమట్ల నిర్వాసితులకు ఇళ్లు

వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులకు ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి ఈనెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాలు కేటాయించనుంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలను ప్రకటించారు.

వెలుగుమట్ల భూముల విషయంలో పనిగట్టుకుని ఒకే కోణంలోనే కొన్ని పత్రికలు, ఛానల్స్ వార్తకథనాలను ప్రసారం చేశాయని... తప్ప నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు మంత్రి పొంగులేటి. వాస్తవానికి ​వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతను గ్రహించలేదని వ్యాఖ్యానించారు.

చాలా మంది పేదవాళ్లు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని మంత్రి పొంగులేటి తెలిపారు. పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారన్నారు. పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు రూ. 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారన్నారు.

అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను వంటి మౌళిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More