భారత ఆటోమొబైల్ మార్కెట్లో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ కీలక అడుగు వేస్తోంది. తమ అత్యంత ఖరీదైన లగ్జరీ సబ్-బ్రాండ్ ‘డెంజా’ను దేశీయ మార్కెట్లోకి అధికారికంగా తీసుకొస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 13న 'డెంజా డీ9' అనే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని, ‘డెంజా జెడ్9 జీటీ’ పర్ఫార్మెన్స్ కారును ఆవిష్కరించనుంది.

ఇక విడుదలకు కొన్ని గంటల ముందు కంపెనీ డెంజా డీ9 టీజర్‌ను తాజాగా విడుదల చేసింది.
ఇటీవలే ముంబై రోడ్లపై ఎలాంటి కవర్లు లేకుండా ఈ కారు దర్శనమివ్వడంతో వాహన ప్రియుల్లో ఆసక్తి రెట్టింపైంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో సినీ తారలు, పారిశ్రామికవేత్తల్లో టయోటా వెల్‌ఫైర్ వంటి లగ్జరీ ఎంపీవీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ అవతారంలో వస్తున్న డెంజా డీ9, నేరుగా టయోటా వెల్‌ఫైర్‌తో పాటు ఎంజీ ఎం9 కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ రెండు మోడళ్లను విదేశాల్లో తయారు చేసి పూర్తిస్థాయి వాహనాలుగా (సీబీయూ) భారత్‌కు దిగుమతి చేయనున్నారు.
520 కిలోమీటర్ల రేంజ్.. అదిరిపోయే బ్యాటరీ సామర్థ్యం
అంతర్జాతీయ మార్కెట్లో డెంజా డీ9 ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్లలో లభిస్తోంది. అయితే భారత మార్కెట్లోకి మాత్రం కేవలం బ్యాటరీ ఎలక్ట్రిక్ వెర్షన్‌నే తీసుకొస్తున్నారు. ఇందులో శక్తివంతమైన 103 kWh బ్లేడ్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్టీపీ సైకిల్ ప్రకారం) వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.
పనితీరు విషయంలోనూ ఈ ఎలక్ట్రిక్ కారు ఏమాత్రం తగ్గదు. ఫ్రంట్-వీల్ డ్రైవ్ వేరియంట్ 313 హెచ్‌పీ పవర్‌ని, 360 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ఏకంగా 374 హెచ్‌పీ పవర్‌ని, 470 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. సుదూర ప్రయాణాల్లో సమయం ఆదా చేసేందుకు ఇందులో 200 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు.
లగ్జరీ ఇంటీరియర్.. 7 సీట్ల విశాలమైన క్యాబిన్
{{/usCountry}}పనితీరు విషయంలోనూ ఈ ఎలక్ట్రిక్ కారు ఏమాత్రం తగ్గదు. ఫ్రంట్-వీల్ డ్రైవ్ వేరియంట్ 313 హెచ్‌పీ పవర్‌ని, 360 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ఏకంగా 374 హెచ్‌పీ పవర్‌ని, 470 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. సుదూర ప్రయాణాల్లో సమయం ఆదా చేసేందుకు ఇందులో 200 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు.
లగ్జరీ ఇంటీరియర్.. 7 సీట్ల విశాలమైన క్యాబిన్
{{/usCountry}}డెంజా డీ9 ఎలక్ట్రిక్ ఎంపీవీ పరిమాణంలో చాలా పెద్దదిగా, రాజసంగా కనిపిస్తుంది. ఈ కారు పొడవు 5,250 మిల్లీమీటర్లు, వెడల్పు 1,960 మిల్లీమీటర్లు, ఎత్తు 1,920 మిల్లీమీటర్లు ఉంది. మూడు వరుసల సీట్లకు సరిపడా విశాలమైన స్థలం ఉండేలా 3,110 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌ను రూపొందించారు. ముందు భాగంలో భారీ గ్రిల్ ప్యానెల్, సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ స్లైడింగ్ రియర్ డోర్లు, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ దీనికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చాయి.
కారు లోపలి భాగం (ఇంటీరియర్) ఏడుగురు ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా కూర్చునేలా 2+2+3 సీటింగ్ అమరికతో ఉంటుంది. ఇక రెండో వరుసలో ఉండే రెండు కెప్టెన్ సీట్లకు ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే బ్యాక్‌రెస్ట్‌లు, కాళ్లు చాపుకునే లెగ్ సపోర్ట్‌లతో పాటు హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫీచర్లు ఉన్నాయి. అంతర్జాతీయ మోడల్‌లో నాప్పా లెదర్ సీట్లు, వుడ్ ట్రిమ్, సూయెడ్ ఫినిషింగ్‌తో ప్రీమియం అనుభూతిని కల్పించారు.
అత్యాధునిక టెక్నాలజీ.. హై-టెక్ భద్రతా ఫీచర్లు
డెంజా డీ9 డ్యాష్‌బోర్డ్‌పై 15.6 అంగుళాల భారీ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. విదేశీ మోడళ్లలో 14 స్పీకర్ల డైనోడియో సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి విలాసవంతమైన ఫీచర్లను అందిస్తున్నారు. రెండో వరుస ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సరౌండ్-వ్యూ కెమెరా, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను జతచేశారు.
2.7 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. డెంజా జెడ్9 జీటీ ప్రత్యేకతలివే!
నవంబర్ 13న జరిగే ఇదే కార్యక్రమంలో డెంజా సంస్థ తమ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ షూటింగ్ బ్రేక్ కారు 'డెంజా జెడ్9 జీటీ'ని కూడా భారత మార్కెట్లోకి పరిచయం చేస్తోంది. అంతర్జాతీయ మోడల్‌లో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి ఏకంగా 1,156 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సూపర్ కారు కేవలం 2.7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మలుపుల్లో సులభంగా తిరిగేందుకు ఇందులో రియర్-వీల్ స్టీరింగ్ సదుపాయం ఉంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో బీవైడీ సంస్థ అట్టో 3, సీయెల్ , సీలయన్ 7, ఈమ్యాక్స్ 7 కార్లను విక్రయిస్తోంది. వీటన్నింటి కంటే పైస్థాయి లగ్జరీ విభాగంలో డెంజా డీ9, జెడ్9 జీ కార్లను కంపెనీ నిలబెట్టనుంది. త్వరలోనే ఈ రెండు కార్ల ధరలు, బుకింగ్ వివరాలపై పూర్తి స్పష్టత రానుంది.