అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి (H-1B) వీసాల విషయంలో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు అక్కడి విద్యావ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని పాఠశాలలు తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. విదేశీ ఉపాధ్యాయులను నియమించుకోవడానికి అయ్యే ఖర్చును భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద ఎత్తున న్యాయపోరాటానికి దారితీసింది.
లక్ష డాలర్ల భారం.. విద్యావ్యవస్థపై నీలినీడలు

కొత్త నిబంధనల ప్రకారం, విదేశీ నిపుణులను నియమించుకునే సంస్థలు సాధారణ అప్లికేషన్ ఫీజులతో పాటు అదనంగా $100,000 (సుమారు రూ. 84 లక్షలు) స్పాన్సర్‌షిప్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా $9,500 నుంచి $18,800 మధ్య ఉండే ఈ ఖర్చు, ఒక్కసారిగా లక్ష డాలర్లకు చేరడంతో పాఠశాలలు బేలెత్తిపోతున్నాయి. కాలిఫోర్నియాలో గణితం, సైన్స్ వంటి కీలక సబ్జెక్టులను బోధించేందుకు స్థానిక టీచర్లు దొరక్కపోవడంతో, అక్కడి యాజమాన్యాలు భారత్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఈ భారీ ఫీజు ఆ మార్గాన్ని మూసేస్తోంది.
'ఇది ముమ్మాటికీ వివక్షే'.. టీచర్ల ఆవేదన
ఈ నిర్ణయంపై విదేశీ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "కాలిఫోర్నియాలో టీచర్లు కావాలని అందరూ అంటారు. కానీ మేము ఇక్కడ ఉండటానికి ఎవరూ సహకరించరు" అని ఒక జె-1 (J-1) వీసా టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ మాట్లాడుతూ.. "ఒక టీచర్ ఉద్యోగం కోసం లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం అంటే అది ముమ్మాటికీ వివక్షే" అని పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో ఖాళీలు.. అంకెలలో భయానక వాస్తవం
లెర్నింగ్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం, జూన్ 2025 నాటికి అమెరికా వ్యాప్తంగా దాదాపు 45,852 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలిఫోర్నియా టీచర్స్ అసోసియేషన్ వెల్లడించిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
- ఈ ఏడాది కాలిఫోర్నియాలో 32,000 కంటే ఎక్కువ తరగతి గదులను కనీస అర్హతలు లేని టీచర్లు నడుపుతున్నారు.
- దాదాపు 10,000 టీచర్ పోస్టులు భర్తీ కాకుండా అలాగే ఉన్నాయి. గత ఏడాది కాలిఫోర్నియా స్కూల్స్ 294 హెచ్-1బి వీసాలను పొందాయి.
- ఇది 2018-19 నాటి 193 వీసాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
ట్రంప్ నిర్ణయానికి మద్దతుదారుల వాదన
{{/usCountry}}లెర్నింగ్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం, జూన్ 2025 నాటికి అమెరికా వ్యాప్తంగా దాదాపు 45,852 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాలిఫోర్నియా టీచర్స్ అసోసియేషన్ వెల్లడించిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
- ఈ ఏడాది కాలిఫోర్నియాలో 32,000 కంటే ఎక్కువ తరగతి గదులను కనీస అర్హతలు లేని టీచర్లు నడుపుతున్నారు.
- దాదాపు 10,000 టీచర్ పోస్టులు భర్తీ కాకుండా అలాగే ఉన్నాయి. గత ఏడాది కాలిఫోర్నియా స్కూల్స్ 294 హెచ్-1బి వీసాలను పొందాయి.
- ఇది 2018-19 నాటి 193 వీసాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
ట్రంప్ నిర్ణయానికి మద్దతుదారుల వాదన
{{/usCountry}}మరోవైపు, ట్రంప్ 'మాగా' (MAGA) మద్దతుదారులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. హెచ్-1బి ప్రోగ్రామ్ ఉద్దేశం విలక్షణమైన టెక్నాలజీ రంగంలో నిపుణులను తీసుకురావడమే తప్ప, సాధారణ టీచింగ్ ఉద్యోగాల కోసం కాదని వారు వాదిస్తున్నారు. విదేశీయులను తీసుకోవడం వల్ల స్థానిక అమెరికన్ ఉపాధ్యాయులకు అవకాశాలు దెబ్బతింటున్నాయని వారి అభిప్రాయం.
న్యాయస్థానానికి చేరిన వివాదం
ట్రంప్ ప్రభుత్వ ఆంక్షలపై కాలిఫోర్నియా ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. ఫెడరల్ ఏజెన్సీలపై కోర్టులో కేసు వేసింది. ఈ పోరాటంలో కాలిఫోర్నియాతో పాటు మరో 18 రాష్ట్రాలు జతకట్టాయి. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వంటి విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తూ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ దావా వేశారు.