ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగాన్ని కుదిపేస్తున్నాయి! ఫలితంగా అనేక సంస్థలు భారీ లేఆఫ్స్ చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫారమ్ ‘కాన్వా’. తమ సంస్థలోని సిబ్బందిలో ఏకంగా 22 శాతానికి పైగా తొలగిస్తున్నట్లు ప్రకటించిన కాన్వా.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.

మొత్తం 1,271 మంది ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుందని కంపెనీ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెలానీ పెర్కిన్స్ ఉద్యోగులకు పంపిన ఒక లేఖలో వెల్లడించారు. 13 ఏళ్ల కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత కఠినమైన నిర్ణయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాన్వా లేఆఫ్స్‌కు అసలు కారణం ఏంటి?
ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన 'క్లాడ్', చాట్‌జీపీటీ వంటి అత్యాధునిక ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో.. గ్రాఫిక్ డిజైనింగ్, లోగో మేకింగ్, ప్రెజెంటేషన్లు, పోస్టర్ క్రియేషన్ వంటి పనులను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ల అవసరం లేకుండానే సాధారణ వినియోగదారులు కూడా సులువుగా చేసుకోగలుగుతున్నారు. దీనివల్ల సాంప్రదాయ డిజైనింగ్ టూల్స్ వ్యాపారానికి గండి పడుతోందనే ఆందోళనలు ముదిరాయి.
గత పదేళ్లలో మొదటిసారిగా కంపెనీ వృద్ధి రేటు మందగించడంతో, వ్యయాలను తగ్గించుకుని సంస్థను మరింత సరళంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పెర్కిన్స్ తెలిపారు. సిడ్నీలోని కాన్వా ప్రధాన కేంద్రాన్ని ప్రొడక్ట్ టీమ్‌ల ముఖ్య కార్యాలయంగా మార్చనున్నారు. రాబోయే రోజుల్లో హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు వారానికి 2 నుంచి 3 రోజులు కచ్చితంగా ఆఫీసుకే వచ్చి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఫ్యూజన్ బుక్స్ నుంచి 40 బిలియన్ డాలర్ల దిగ్గజం వరకు!
2008లో మెలానీ పెర్కిన్స్, క్లిఫ్ ఒబ్రెచ్ట్తో కలిసి 'ఫ్యూజన్ బుక్స్' పేరుతో ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 2013లో కేమరాన్ నాథన్ జతకలవడంతో 'కాన్వా' పురుడుపోసుకుంది. క్లిష్టమైన డిజైనింగ్ సాఫ్ట్వేర్లతో నిమిషాల్లో ప్రెజెంటేషన్లు చేయడం సాధ్యపడదనే ఆలోచన నుంచి పుట్టిన ఈ స్టార్టప్, అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందింది.
{{/usCountry}}2008లో మెలానీ పెర్కిన్స్, క్లిఫ్ ఒబ్రెచ్ట్తో కలిసి 'ఫ్యూజన్ బుక్స్' పేరుతో ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 2013లో కేమరాన్ నాథన్ జతకలవడంతో 'కాన్వా' పురుడుపోసుకుంది. క్లిష్టమైన డిజైనింగ్ సాఫ్ట్వేర్లతో నిమిషాల్లో ప్రెజెంటేషన్లు చేయడం సాధ్యపడదనే ఆలోచన నుంచి పుట్టిన ఈ స్టార్టప్, అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందింది.
{{/usCountry}}2021 నాటికి కాన్వా మార్కెట్ విలువ ఏకంగా 40 బిలియన్ డాలర్లకు (రూ. 3.3 లక్షల కోట్లు) చేరింది. అయితే టెక్ రంగంలో వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల మరుసటి ఏడాదే దీని విలువ 26 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
బాధిత ఉద్యోగులకు భారీ కాంపెన్సేషన్ ప్యాకేజీ..
తొలగింపునకు గురైన సిబ్బందికి కాన్వా సంస్థ ఎంతో ఉదారమైన కాంపెన్సేషన్ ప్యాకేజీని ప్రకటించింది:
"ఈ నిర్ణయం వల్ల బాధితులయ్యే ప్రతీ ఒక్కరికి కలిగే వేదనను నేను అర్థం చేసుకోగలను. వారికి అన్ని విధాలా అండగా ఉండేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం," అని కాన్వా లేఆఫ్స్ అనంతరం సీఈఓ మెలానీ పెర్కిన్స్ హామీ ఇచ్చారు.
జీతం, అలవెన్సులు: ఉద్యోగులు ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా కనీసం 6 నెలల పూర్తి జీతం, చట్టబద్ధమైన పరిహారాన్ని చెల్లిస్తారు.
ఆరోగ్య భద్రత: ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు మరో 12 నెలల ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తుంది.
ఆఫీస్ ల్యాప్‌టాప్‌లు: ఆఫీసు పనుల కోసం ఇచ్చిన యాపిల్ మ్యాక్‌బుక్ కంప్యూటర్లను తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులే తమ వద్ద ఉంచుకునేందుకు అనుమతించారు.
కెరీర్ సపోర్ట్: కొత్త ఉద్యోగాల వేట కోసం 1-సంవత్సరం ఉచిత 'లింక్డ్‌ఇన్ ప్రీమియం' మెంబర్‌షిప్‌తో పాటు వన్-ఆన్-వన్ ఇంటర్వ్యూ కోచింగ్ ఇస్తారు.
సొంత స్టార్టప్ ఆశావహులకు నిధులు: ఉద్యోగాన్ని వదిలి సొంతంగా కంపెనీ లేదా స్టార్టప్ ప్రారంభించాలనుకునే మాజీ ఉద్యోగులకు 10,000 యూఎస్ డాలర్ల గ్రాంట్‌ను అందిస్తారు. దీనిపై కాన్వా ఎలాంటి ఈక్విటీ లేదా యాజమాన్య హక్కులను కోరకపోవడం విశేషం!
ఏఐ విప్లవం తీసుకొస్తున్న మార్పులు సాఫ్ట్‌వేర్ రంగంలో శరవేగంగా కొలువుల స్వరూపాన్ని మార్చేస్తున్నాయి. మరి మున్ముందు టెక్ కంపెనీలు ఈ ఏఐ సవాళ్లను ఎలా తట్టుకుంటాయో వేచి చూడాలి.