పండుగ సీజన్ సమీపిస్తుండటంతో భారత ఆటోమొబైల్ రంగం నూతన ఉత్సాహంతో ఊపిరి పోసుకుంటోంది. వినాయక చవితి, దసరా, దీపావళి సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి దించేందుకు సమాయత్తమయ్యాయి. ఇందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు పర్యావరణహిత హైబ్రిడ్, ప్యూర్ ఎలక్ట్రిక్ వేరియంట్లతో కూడిన ఆరు దిగ్గజ కార్లు భారత రోడ్లపైకి రాబోతున్నాయి.

సాధారణ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్ల ప్రేమికుల వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్న ఆ టాప్ 6 కార్ల పూర్తి వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.
1. కియా సోరెంటో..
- లాంచ్ తేదీ- సెప్టెంబర్ 4
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా తన ప్రీమియం ఎస్‌యూవీ 'సోరెంటో' ద్వారా భారత మార్కెట్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. ఈ కారుతో కియా తొలిసారిగా భారతదేశంలో తమ పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ సాంకేతికతను ఆవిష్కరిస్తోంది. 3 వరుసల సీటింగ్ సామర్థ్యంతో వస్తున్న ఈ కారులో కర్వ్‌డ్ డ్యూయల్ స్క్రీన్, విమానం తరహా కంఫర్ట్ ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 అడాస్ భద్రతా సాంకేతికత ఉన్నాయి. భారత మార్కెట్లో ఇప్పటికే పాతుకుపోయిన టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్ వంటి మోడళ్లకు ఇది సవాల్ విసిరే అవకాశం ఉంది.
2. మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్
- లాంచ్ తేదీ- సెప్టెంబర్ 5
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బలెనో'ను నయా లుక్‌తో సెప్టెంబర్ 5న విడుదల చేస్తోంది. నూతనంగా రూపుదిద్దుకున్న 1.2-లీటర్ జెడ్ సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో అమర్చారు. ఇది 80 బీహెచ్‌పీ పవర్, 112 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ తర్వాత ఈ విభాగంలో సీఎన్జీ-ఏఎంటీ కాంబినేషన్‌తో వస్తున్న రెండో కారు ఇదే కావడం విశేషం. కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, అడాస్ సేఫ్టీ ఫీచర్లతో ఇది మరింత అధునాతనంగా మారింది.
3. బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఐ7 ఫేస్‌లిఫ్ట్..
- లాంచ్ తేదీ- సెప్టెంబర్ 11
బీఎండబ్ల్యూ సంస్థ మరొక సంచలనానికి తెరలేపనుంది. అప్డేటెడ్ 7 సిరీస్, ప్యూర్ ఎలక్ట్రిక్ వర్షన్ ఐ7 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను ఆవిష్కరించనుంది. మునుపెన్నడూ చూడని రీతిలో వెలుగులీనే ఫ్రంట్ గ్రిల్, డాష్‌బోర్డ్ పొడవునా పరుచుకున్న గ్లాస్ డిస్ప్లే, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా 14.6-ఇంచుల స్క్రీన్‌ను అమర్చారు. వెనుక సీట్లో కూర్చునే విఐపిల కోసం ఏకంగా 31.3-ఇంచుల 8కే థియేటర్ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
4. రెనాల్ట్ ట్రైబర్ టర్బో..
- లాంచ్ తేదీ- సెప్టెంబర్ 2026
బీఎండబ్ల్యూ సంస్థ మరొక సంచలనానికి తెరలేపనుంది. అప్డేటెడ్ 7 సిరీస్, ప్యూర్ ఎలక్ట్రిక్ వర్షన్ ఐ7 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను ఆవిష్కరించనుంది. మునుపెన్నడూ చూడని రీతిలో వెలుగులీనే ఫ్రంట్ గ్రిల్, డాష్‌బోర్డ్ పొడవునా పరుచుకున్న గ్లాస్ డిస్ప్లే, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా 14.6-ఇంచుల స్క్రీన్‌ను అమర్చారు. వెనుక సీట్లో కూర్చునే విఐపిల కోసం ఏకంగా 31.3-ఇంచుల 8కే థియేటర్ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
4. రెనాల్ట్ ట్రైబర్ టర్బో..
- లాంచ్ తేదీ- సెప్టెంబర్ 2026
తక్కువ ఖర్చుతో ఎక్కువ స్పేస్ కోరుకునే సామాన్య కుటుంబాలకు రెనాల్ట్ ట్రైబర్ ఎప్పటినుంచో నమ్మకమైన వాహనంగా ఉంది. ఇప్పుడు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కారుకు మరింత పవర్ జోడిస్తూ 'ట్రైబర్ టర్బో' వేరియంట్‌ను రెనాల్ట్ భారత మార్కెట్‌కు పరిచయం చేస్తోంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 99 బీహెచ్‌పీ పవర్, 160 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. కొత్త ఆర్‌జీఈపీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ మోడల్ ఘాట్ రోడ్లు, సుదీర్ఘ ప్రయాణాల్లో మునుపటి కంటే మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.
5. బీఎండబ్ల్యూ ఐ5 ఎల్‌డబ్ల్యూబీ..
- లాంచ్ తేదీ- సెప్టెంబర్ 2026
లగ్జరీ ఎలక్ట్రిక్ విభాగంలో జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ తన ఐ5 లాంగ్ వీల్‌బేస్ సెడాన్‌ను పరిచయం చేస్తోంది. సాధారణ వర్షన్ కంటే ఇది 100 ఎంఎం అదనపు పొడవు, వీల్‌బేస్ కలిగి ఉండి, దాదాపు 5.1 మీటర్ల పొడవుతో వెనుక సీటు ప్రయాణికులకు రాచరికపు స్థలాన్ని ఇస్తుంది. 81.6kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ విలాసవంతమైన కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 669 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.
6. పోర్షే కయేన్ ఎలక్ట్రిక్..
- లాంచ్ తేదీ- సెప్టెంబర్ 2026
సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ ఎస్‌యూవీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పోర్షే కయేన్ ఎలక్ట్రిక్' ఈ నెలే భారత్‌లో కాలుమోపనుంది. రూ. 1.77 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో లభించే ఈ ఎలక్ట్రిక్ వాహనంలో 113kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. దీని ఫ్లాగ్‌షిప్ కయేన్ టర్బో ఎలక్ట్రిక్ వర్షన్ ఏకంగా 844 బీహెచ్‌పీ పవర్, 1,500 ఎన్‌ఎమ్ టార్క్‌ను నిమిషాల్లో బయటకు తీస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 643 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దారు.