...
...
Next Story

ఇంకొన్ని రోజుల్లో CAT 2025- ఈ 10 సాధారణ తప్పులు అస్సలు చేయకూడదు..!

ఐఐఎం క్యాట్​ 2025కి ప్రిపేర్​ అవుతున్నారా? అయితే ఇది మీకోసమే! విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (వీజేఐఎం) డైరెక్టర్ ప్రొఫెసర్ డా. భారత్ భూషణ్ సింగ్ ఇచ్చిన కీలక టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 14, 2025 12:20 PM IST
Advertisement

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నిర్వహిస్తున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్​) 2025 పరీక్ష అడ్మిట్ కార్డులు ఇప్పటికే విడులయ్యాయి. ఇక మిగిలింది పరీక్ష మాత్రమే! ప్రతిష్ఠాత్మక ఐఐఎంలతో పాటు ఇతర ప్రముఖ బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.. నవంబర్ 30, 2025 న దేశవ్యాప్తంగా జరగనుంది.

క్యాట్​ 2025 ప్రిపరేషన్​ టిప్స్​ ఇవిగో..
క్యాట్​ 2025 ప్రిపరేషన్​ టిప్స్​ ఇవిగో..

పరీక్షా తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అభ్యర్థులు అకాడమిక్ రివిజన్‌తో పాటు మైండ్​సెట్​, ప్రశాంతత, సమయ నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. చివరి దశ తయారీలో అభ్యర్థులు సాధారణంగా చేసే పొరపాట్లను నివారించడానికి కొన్ని కీలక సూచనలు చేశారు విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (వీజేఐఎం) డైరెక్టర్ ప్రొఫెసర్ (డా.) భారత్ భూషణ్ సింగ్.

"క్యాట్​ కేవలం మీకు తెలిసిన దాని గురించే కాదు – ఒత్తిడిలో మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా ప్రదర్శిస్తారు అనే దాని గురించి!" అని డా. సింగ్ అన్నారు. "చాలా మంది విద్యార్థులు గత సంవత్సరం కటాఫ్‌ను దాటాలనే ఉద్దేశంతో మాత్రమే సిద్ధమవుతారు. ఇది లక్ష్యం కాకుండా ఒక పరిమితిని సృష్టిస్తుంది. తెలివైన విధానం ఏంటంటే.. పరీక్ష రాసే వారిలో టాప్ 10% లో నిలవడానికి లక్ష్యంగా పెట్టుకోవడం. ఇది ఆత్మవిశ్వాసం, స్థితిస్థాపకత రెండింటినీ పెంచుతుంది," అని వివరించారు.

క్యాట్​ 2025- కటాఫ్ ట్రాప్‌ను నివారించండి..

క్యాట్​ పరీక్షలో గత కటాఫ్ ట్రెండ్‌లపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదని డా. సింగ్ హెచ్చరించారు. పరీక్ష కఠినత్వం, పోటీని బట్టి ప్రతీ సంవత్సరం కటాఫ్‌లు మారుతాయని గుర్తుచేశారు.

ఎంత బాగా సిద్ధమైన అభ్యర్థులైనా, పరీక్ష రోజు ఆందోళన పెరిగితే వారి పనితీరు తగ్గిపోతుంది. "శాంతంగా, ఫోకస్​తో కూడిన మనస్సు సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఆప్షన్స్​ని మెరుగ్గా అంచనా వేస్తుంది, నిర్లక్ష్యం వల్ల వచ్చే పొరపాట్లను నివారిస్తుంది," అని డా. సింగ్ సూచించారు.

ప్రశ్నలను అటెంప్ట్ చేయడానికి ఇది ఫాలో అవ్వండి..

పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి డా. సింగ్ ఒక నిర్మాణబద్ధమైన పద్ధతిని సూచించారు:

మొదటగా: మీకు 100% తెలిసిన ప్రశ్నలను ముందుగా అటెంప్ట్ చేయండి. ఇది ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

తరువాత: 75శాతం తెలిసిన ప్రశ్నల వైపుకు వెళ్లండి. ఇక్కడ సమాధానాన్ని కనుగొనడానికి లాజిక్‌ను లేదా ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించండి.

చివరిగా: 50 శాతమే అవగాహన ఉన్న ప్రశ్నలను చాలా అరుదుగా మాత్రమే అటెంప్ట్ చేయండి.

గుడ్డి అంచనాలు వద్దు: క్యాట్​ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి, తెలియని ప్రశ్నలకు గుడ్డిగా అంచనా వేయకుండా ఉండాలి.

"ఈ శ్రేణీకృత విధానం స్పష్టతను నిర్వహించడానికి, భయాన్ని నివారించడానికి, ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది," అని ఆయన తెలిపారు.

క్యాట్​ 2025- తప్పనిసరిగా నివారించాల్సిన 10 సాధారణ తప్పులు

క్యాట్​ 2025 స్కోర్‌లను ప్రభావితం చేసే అత్యంత సాధారణ తయారీ లోపాలను డా. సింగ్​ హైలైట్ చేశారు. అవి..

క్యాట్​లో ఒక విభాగంలో బలంగా ఉంటే సరిపోదు, సమతుల్య పనితీరుకు రివార్డ్ ఇస్తుంది.

మాక్ టెస్ట్ రాయడానికి తీసుకున్న సమయం కంటే 2-3 రెట్లు ఎక్కువ సమయాన్ని దానిని విశ్లేషించడానికి కేటాయించండి.

టైమ్‌డ్ ప్రాక్టీస్ పరీక్షా రిథమ్‌ను, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

డీఐఎల్​ఆర్​ (డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్​ లాజికల్ రీజనింగ్) ను యాదృచ్ఛికంగా ప్రాక్టీస్ చేయడం మంచిది. అన్ని సెట్‌లను పరిష్కరించడానికి ప్రయత్నించకుండా, సరైన సెట్‌లను ఎంచుకోవడం పై దృష్టి పెట్టండి.

చివరి వారాల్లో కొత్తవి నేర్చుకోవడం మానేసి, రివిజన్, పాత అంశాలపై ఫోకస్​ చేయడంపై దృష్టి సారించండి.

వ్యక్తిగత నోట్స్ ఉంటే, అవి పదేపదే చేసే తప్పులను నివారించడానికి సహాయపడతాయి.

రీజనింగ్, ఇన్‌ఫరెన్స్, టోన్ ఆధారిత ప్రశ్నలతో యాక్టివ్​గా వ్యవహరించండి.

ఎస్టిమేషన్​, ఎలిమినేషన్ పద్ధతులను ఉపయోగించండి.

క్రమబద్ధంగా, దృష్టి కేంద్రీకరించి చదవడం, అప్పుడప్పుడు ఎక్కువ సేపు చదవడం కంటే మెరుగైనది.

అలసిపోయిన మనస్సు కంటే తాజాదనం ఉన్న మనస్సు మెరుగ్గా పనిచేస్తుంది. అందుకే రెస్ట్​ తీసుకోండి. రిఫ్రెష్​గా ఉంటారు.

క్యాట్​లో విజయం అనేది జ్ఞానంపై ఆధారపడినంతగానే.. మానసిక స్థైర్యం, స్థిరత్వంపై కూడా ఆధారపడి ఉంటుందని డా. సింగ్ సూచలను బలంగా చెబుతున్నాయి. అభ్యర్థులు ప్రశాంతంగా ఉండి, తెలివిగా రివైజ్ చేసుకుని, ఆత్మవిశ్వాసం, స్పష్టతతో పరీక్షను ఎదుర్కోవాలని ప్రోత్సహించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe