త్వరలోనే CAT 2025 ఫలితాలు- స్కోర్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
క్యాట్ 2025 ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. ఈ విషయంపై ఐఐఎం కోజికోడ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫలితాలను ఎలా చూసుకోవాలి? స్కోర్‌కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2025 తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కోజికోడ్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల క్యాట్ 2025 స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in లో అందుబాటులో ఉంటాయి. అలాగే, అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమాచారం పంపే అవకాశం ఉంది.

క్యాట్ 2025 ఫలితాలు విడుదలయ్యే తేదీని ఇంకా ప్రకటించలేదు. కాగా ఇన్ఫర్మేషన్ బులిటెన్ ప్రకారం.. ఫలితాలు జనవరి 2026 మొదటి వారం నాటికి వెలువడే అవకాశం ఉంది.
క్యాట్ 2025 స్కోర్‌కార్డ్ డిసెంబర్ 31, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తేదీ వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత, స్కోర్‌కార్డుల జారీకి సంబంధించిన ఎలాంటి అభ్యర్థనలను స్వీకరించరు.
క్యాట్ 20235- ఫలితాల ప్రకటన, మెరిట్ జాబితా..
క్యాట్ 2025 పరీక్షను నిర్వహించిన ఐఐఎం కోజికోడ్.. స్కోర్‌కార్డులు, తుది ఆన్సర్ కీ, మెరిట్ జాబితాను ఒకేసారి విడుదల చేస్తుంది. ఈ మెరిట్ జాబితాలో అర్హత పొందిన అభ్యర్థుల పేర్లతో పాటు వారి పర్సంటైల్ స్కోర్‌లు కూడా ఉంటాయి.
నవంబర్ 30న క్యాట్ 2025 పరీక్షకు సుమారు 2.58 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాత్కాలిక ఆన్సర్ కీ డిసెంబర్ 4న విడుదలైంది. అభ్యంతరాలను డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 10 మధ్య స్వీకరించారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు లాగిన్ అయ్యి అధికారిక పోర్టల్ నుంచి తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
క్యాట్ 2025 ఫలితాల ప్రకటనపై తాజా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించడమైనది.
క్యాట్ 2025 స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ను సందర్శించండి.
- 'CAT 2025 Scorecard Download' అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ క్యాట్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- స్కోర్‌కార్డ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- క్యాట్ 2025 ఫలితాల పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
క్యాట్ ప్రవేశ ప్రక్రియ..
ప్రతి ఐఐఎం తన సొంత అర్హత ప్రమాణాలను (అకాడమిక్ కట్-ఆఫ్‌లు, రిలేటివ్ వెయిట్స్ సహా) నిర్ణయించుకునే స్వాతంత్ర్యం కలిగి ఉంటుంద. ఒక్కో ఐఐఎం విభిన్న ఎంపిక ప్రక్రియలను అనుసరిస్తుంది. క్యాట్ 2025లో ప్రదర్శన అనేది ఎంపిక ప్రక్రియలో ముఖ్యమైన భాగం.
దీనికి అదనంగా, ఐఐఎంలు వివిధ దశలలో దరఖాస్తుదారులను షార్ట్‌లిస్ట్ చేసేటప్పుడు వారి గత విద్యా రికార్డులు, సంబంధిత పని అనుభవం, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.
ఐఐఎంలలో యూజీ కోర్సులు- ఇవి తెలుసుకోండి..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో చదవాలనుకునే విద్యార్థులు ఇకపై గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు! పలు ఐఐఎంలు ఇప్పుడు ఇంటర్ (12వ తరగతి) పూర్తయిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అండర్‌గ్రాడ్యుయేట్ (యూజీ), ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
ఈ మార్పుతో విద్యార్థులకు మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, డేటా సైన్స్, పబ్లిక్ పాలసీ, డిజిటల్ బిజినెస్ వంటి కీలక విభాగాల్లోకి ముందస్తుగా ప్రవేశించే అవకాశం లభిస్తుంది. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


