CBSE Class 10 Results 2026 : సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్​ చేసుకోవాలి?

CBSE Class 10 Results 2026 date : సీబీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. మరి ఫలితాలు ఎప్పుడు? గత ట్రెండ్స్​ ప్రకారం ఈ ఏడాది పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయో ఇక్కడ చూడండి. ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో కూడా ఇచ్చాము.

Updated on: Mar 14, 2026, 05:28:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 17న మ్యాథమెటిక్స్ పేపర్‌తో ప్రారంభమైన ఈ పరీక్షలు, మార్చ్​ 10న ఫ్రెంచ్ పేపర్‌తో పూర్తయ్యాయి. పరీక్షలు పూర్తి కావడంతో ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి ఫలితాలపై పడింది. మరి సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు ఎప్పుడు?

సీబీఎస్​ఈ అప్డేట్స్​ 2026..
సీబీఎస్​ఈ అప్డేట్స్​ 2026..

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు 2026- ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?

2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఫలితాల తేదీని బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గత మూడేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే మే రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం మెండుగా ఉంది.

గత మూడేళ్లలో ఫలితాల విడుదల తేదీలు:

2025 - మే 13

2024 - మే 13

2023 - మే 12

దీని బట్టి చూస్తే, ఈ ఏడాది కూడా మే మధ్యలో అంటే మే 12 నుంచి 15 నాటికి సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు 2026- ఎక్కడ, ఎలా చూడాలి?

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్లలో మార్కులను చూసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్లు:

cbse.gov.in

results.nic.in

results.digilocker.gov.in

umang.gov.in

మొబైల్ యాప్స్ ద్వారా:

వెబ్‌సైట్లతో పాటు DigiLocker, UMANG వంటి ప్రభుత్వ యాప్స్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా పొందవచ్చు. డిజిలాకర్ ద్వారా విద్యార్థులు తమ మార్క్స్ మెమోలు, మైగ్రేషన్ సర్టిఫికేట్లను డిజిటల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎస్​ఎంఎస్​ ద్వారా ఫలితాలు:

ఇంటర్నెట్ అందుబాటులో లేని వారు ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని వాడుకోవచ్చు.

cbse10 <రోల్ నంబర్> <స్కూల్ నంబర్> <సెంటర్ నంబర్> టైప్ చేసి 7738299899 కు పంపాలి.

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- ఈ ఏడాది పరీక్షల గణాంకాలు..

ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో దాదాపు 14 లక్షల మంది బాలురు, 10.9 లక్షల మంది బాలికలు ఉన్నారు. ఫలితాల విడుదలతో పాటు రీజియన్ల వారీగా ఉత్తీర్ణత శాతం, జెఎన్​వీ, కేవీ పాఠశాలల ప్రదర్శన, 90 శాతం పైగా మార్కులు సాధించిన వారి వివరాలను బోర్డు వెల్లడిస్తుంది.

ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? 'కంపార్ట్‌మెంట్' రూల్స్ ఇవే..

ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు 'కంపార్ట్‌మెంట్' పరీక్షలు రాసుకునే అవకాశం ఉంటుంది. వీటి షెడ్యూల్‌ను ఫలితాల అనంతరం ప్రకటిస్తారు.

అయితే, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం:

పాస్ అయిన విద్యార్థులు తమ స్కోరు పెంచుకోవడానికి (ఇంప్రూవ్​మెంట్​) సైన్స్, మ్యాథ్స్, సోషల్ వంటి మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసుకోవచ్చు.

మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పిన వారు 'ఎసెన్షియల్​ రిపీట్​' కేటగిరీ కిందకు వస్తారు. వీరు మరుసటి ఏడాది మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2026 ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?

బోర్డు ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే, గత మూడేళ్ల ధోరణిని బట్టి చూస్తే, ఫలితాలు మే 12 నుంచి మే 15, 2026 మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా 10, 12వ తరగతి ఫలితాలను బోర్డు ఒకేరోజు లేదా ఒక రోజు వ్యవధిలో విడుదల చేస్తుంది.

2. నా అడ్మిట్ కార్డ్ పోగొట్టుకున్నాను, రోల్ నంబర్ లేకుండా ఫలితాలు చూడవచ్చా?

ఫలితాలను చూడటానికి రోల్ నంబర్, స్కూల్ నంబర్ తప్పనిసరి. ఒకవేళ మీరు అడ్మిట్ కార్డ్ పోగొట్టుకుంటే, వెంటనే మీ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి మీ వివరాలను పొందవచ్చు. అలాగే, మీ ఆధార్ నంబర్‌తో అనుసంధానమైన DigiLocker ఖాతా ద్వారా కూడా మీ మార్క్స్ మెమోను నేరుగా పొందవచ్చు.

3. ఒకవేళ నేను ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఏం చేయాలి?

కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం బోర్డు కంపార్ట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఫలితాలు విడుదలైన వెంటనే ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పితే, వచ్చే ఏడాది మళ్లీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More