...
...
Next Story

Central Bank Recruitment : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ ఉద్యోగాలు - ఏపీ, తెలంగాణలోనూ ఖాళీలు

Central Bank of India Apprentice Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జూన్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

Published on: Jun 14, 2026, 08:12:07 IST
Advertisement

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వారి సంస్థాగత శాఖల్లో ఖాళీగా ఉన్న 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ ఉద్యోగాలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారీ సంఖ్యలో అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంలో శిక్షణ పొందే అవకాశం లభించనుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ centralbank.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని వివరాల ప్రకారం….. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 12 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 22, 2026 వరకు గడువు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై మొదటి వారంలో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించనున్నారు.

అభ్యర్థులు భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దానికి సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు 31.05.1998 కంటే ముందు మరియు 31.05.2006 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు (ఈ రెండు తేదీలు కూడా వర్తిస్తాయి). శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

ఎంపిక విధానం ఇలా…

నిర్ణీత ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

  • ఆన్‌లైన్ టెస్ట్ : బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్‌సి (BFSI SSC) ఆధ్వర్యంలో ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 100 మార్కులు కేటాయించారు. పరీక్షా సమయం 60 నిమిషాలు (1 గంట) ఉంటుంది.
  • స్థానిక భాషా పరీక్ష (Test of Local Language) : అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు భాషపై పట్టు ఉండాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe