షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) రిజర్వేషన్లలో 'క్రీమీలేయర్' (ఆదాయ పరిమితి) విధానాన్ని వర్తింపజేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఈ సిద్ధాంతం ఇప్పటివరకు కేవలం ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) మాత్రమే వర్తిస్తుందని, ఎస్సీ, ఎస్టీలకు దీనిని విస్తరించలేమని తేల్చిచెప్పింది.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రమాణపత్రాన్ని (అఫిడవిట్) దాఖలు చేసింది. రిజర్వేషన్లలో ఆదాయ ఆధారిత ఉప-కోటాను (Sub-quota) కోరుతూ దాఖలైన పిటిషన్లను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది.
సామాజిక వివక్షే ప్రధాన ప్రాతిపదిక
భారతదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ కేవలం వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రూపుదిద్దుకోలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. కులం, సామాజిక వెనుకబాటుతనం మరియు తరతరాలుగా అనుభవించిన చారిత్రక వివక్షే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు మూలస్తంభాలని పేర్కొంది.
"రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 (ఎస్సీలు), ఆర్టికల్ 342 (ఎస్టీలు), ఆర్టికల్ 342A (బీసీలు) ప్రకారం ఆయా వర్గాల వర్గీకరణ లేదా గుర్తింపు జరుగుతుంది. కేవలం ఆర్థిక వ్యత్యాసాలను ప్రాతిపదికగా తీసుకుని రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలో మార్పులు చేయడం సాధ్యపడదు" అని ప్రభుత్వం తన వాదనలను వినిపించింది.
సమగ్ర సర్వే లేకుండా ఎలాంటి మార్పులు వద్దు
రిజర్వేషన్ల విధానంలో లేదా ఉప-కోటాల నిర్ణయంలో ఏవైనా మార్పులు చేయాలంటే, ముందుగా సవివరమైన సామాజిక-ఆర్థిక సర్వే (Socio-economic data) నిర్వహించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. లబ్ధిదారుల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు క్రీమీలేయర్ విధానాన్ని పొడిగించాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు కేవలం దేశ పార్లమెంటుకు మాత్రమే ఉంటాయని, న్యాయస్థానాలు రిజర్వేషన్ విధానాలను తిరిగి రూపకల్పన చేసేలా ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
ఏమిటీ 'క్రీమీలేయర్' వివాదం?
సాధారణంగా ఓబీసీ (OBC) వర్గాల్లో ఆర్థికంగా బాగా స్థిరపడిన, విద్యావంతులైన వర్గాలను వేరు చేయడానికి 'క్రీమీలేయర్' విధానాన్ని ఉపయోగిస్తారు. వ్యవసాయేతర మూలాల ద్వారా వార్షికంగా రూ. 8 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు ఓబీసీ రిజర్వేషన్ లబ్ధి దక్కదు.
{{/usCountry}}సాధారణంగా ఓబీసీ (OBC) వర్గాల్లో ఆర్థికంగా బాగా స్థిరపడిన, విద్యావంతులైన వర్గాలను వేరు చేయడానికి 'క్రీమీలేయర్' విధానాన్ని ఉపయోగిస్తారు. వ్యవసాయేతర మూలాల ద్వారా వార్షికంగా రూ. 8 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు ఓబీసీ రిజర్వేషన్ లబ్ధి దక్కదు.
{{/usCountry}}ఈ భావనను మొదటగా 1971లో సత్యనాథన్ కమిషన్ ప్రతిపాదించగా, 1993లో జస్టిస్ రామ్ నందన్ కమిటీ అధికారికంగా గుర్తించింది. అయితే, నాటి నుంచి ఈ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తింపజేయలేదు. దీనివల్ల ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా ఆయా వర్గాల ప్రజలందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి.
అయితే, 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్‌ను గుర్తించి వారిని మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణతో, ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తించదనే విషయంపై తమ వైఖరి ఏంటో స్పష్టంగా వెల్లడించింది.