CAT 2026 : రేపే క్యాట్ పరీక్ష- టైమింగ్స్, డ్రెస్ కోడ్, పూర్తి గైడ్..

నవంబర్ 29న దేశవ్యాప్తంగా క్యాట్ 2026 పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. పరీక్ష టైమింగ్, అభ్యర్థులు హాల్‌టికెట్ ప్రింట్‌తో పాటు ఏయే నిబంధనలు పాటించాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

Published on: Nov 28, 2026, 06:45:26 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలోని ఐఐఎంలు, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష 'కామన్ అడ్మిషన్ టెస్ట్' (క్యాట్ 2026) నవంబర్ 29, 2026న జరగనుంది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐఎం ఇండోర్ చూస్తోంది. సుమారు 170 నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (వీఏఆర్​సీ), డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (డీఐఎల్​ఆర్), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (క్యూఏ) అనే మూడు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.

క్యాట్ 2026 పరీక్ష తేదీ, టైమింగ్స్ సహా ఇతర వివరాలు..
క్యాట్ 2026 పరీక్ష తేదీ, టైమింగ్స్ సహా ఇతర వివరాలు..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ వంటి నగరాల నుంచి వేలాది మంది అభ్యర్థులు క్యాట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడే ఈ పరీక్షలో మంచి స్కోర్ సాధిస్తే ఐఐఎంలలో సీటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష రోజు చివరి నిమిషంలో హడావుడి, ఒత్తిడి లేకుండా కేంద్రాలకు చేరుకోవాలంటే అభ్యర్థులు ముందస్తు నిబంధనలపై స్పష్టత కలిగి ఉండటం ఎంతో అవసరం.

క్యాట్ 2026- మూడు సెషన్లలో పరీక్ష సమయాలు ఇలా..

క్యాట్ 2026 పరీక్షను రెండు గంటల వ్యవధిలో మూడు సెషన్లుగా నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, మూడో సెషన్ సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు జరుగుతాయి.

అభ్యర్థులు తమకు కేటాయించిన సెషన్‌కు అనుగుణంగా సమయానికి ముందే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. తనిఖీ ప్రక్రియలు, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే బయలుదేరడం మంచిది.

క్యాట్ 2026- పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రాలివే..

క్యాట్ 2026 ఎగ్జామ్ రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సాఫీగా సాగాలంటే అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అడ్మిట్ కార్డు (హాల్‌టికెట్) భౌతిక ప్రతులను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి! ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లలో డిజిటల్ కాపీలను చూపిస్తే అనుమతించరు.

హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి అసలుది వెంట ఉండాలి.

క్యాట్ 2026- డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువుల వివరాలు..

క్యాట్ 2026లో భద్రతను పెంచడానికి, అక్రమాలకు తావు లేకుండా చూడటానికి అభ్యర్థులు సాధారణ దుస్తులు ధరించాలని సూచించారు. మెటల్ వస్తువులు, ఆభరణాలు, వాచీలు, బ్రాస్‌లెట్లు లేదా గొలుసులు వేసుకోకూడదు. తనిఖీలు సులభంగా జరిగేందుకు జేబులు లేదా లోహపు హంగులు లేని సాధారణ దుస్తులే మంచివి.

పరీక్ష హాల్ లోపలికి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఏమాత్రం అనుమతించరు. పెన్నులు, రఫ్ షీట్లు వంటి స్టేషనరీ వస్తువులను పరీక్ష కేంద్రంలోనే అందిస్తారు. ఇన్విజిలేటర్ సూచనలను పాటిస్తూ, బయటకు వెళ్లమని చెప్పే వరకు సీటులోనే కూర్చోవాలి. సిస్టమ్ నుంచి బయటకు వచ్చే ముందు పరీక్షను సరిగ్గా సబ్‌మిట్ చేశారో లేదో నిర్ధారించుకోవాలి.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.