మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
AP Police Recruitment : నేటి నుంచే ఎస్సై, కానిస్టేబుల్ దరఖాస్తులు ప్రారంభం - పరీక్ష తేదీలివే
APSLPRB SI Constable Recruitment 2026 : ఏపీలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 27 సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబరు 16 వరకు అప్లై చేసుకోవచ్చని ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటించింది. మరోవైపు పరీక్ష తేదీలను కూడా వెల్లడించింది.
AP SLPRB SI Constable Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు, ఇతర శాఖల కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక రాత పరీక్ష తేదీలను ప్రకటించింది. ఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా గురువారం ఈ వివరాలను విడుదల చేశారు.

నేటి నుంచే దరఖాస్తులు…
ఇవాళ (నవంబరు 27) సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. డిసెంబరు 16 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
ఎస్సై పోస్టులు.. పరీక్ష షెడ్యూల్
ఎస్సై కేటగిరీలో మొత్తం 378 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో సివిల్ ఎస్సై (పురుషులు, మహిళలు) 253, ఏఆర్ రిజర్వ్ ఎస్సై (పురుషులు, మహిళలు) 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) ఎస్సై (పురుషులు) 9 పోస్టులు ఉన్నాయి.
సివిల్ ఎస్సై, ఏఆర్ ఆర్‌ఎస్సై, ఎస్‌పీఎఫ్ ఎస్సై పోస్టులకు నవంబరు 27 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబరు 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రాథమిక రాత పరీక్షను 2027 ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
కానిస్టేబుల్ ఎగ్జామ్ తేదీలు….
- కానిస్టేబుల్ స్థాయిలో మొత్తం 1,156 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి వివరాలు కింది విధంగా ఉన్నాయి…
- సివిల్ కానిస్టేబుళ్లు (పురుషులు, మహిళలు): 542
- ఏఆర్ కానిస్టేబుళ్లు (పురుషులు, మహిళలు): 285
- విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్లు: 158
- జైళ్ల శాఖలో వార్డర్లు (పురుషులు): 150
- జైళ్ల శాఖలో వార్డర్లు (మహిళలు): 21
ఈ పోస్టులకు కూడా నవంబరు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబరు 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక రాత పరీక్షను 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
పీటీవో, కమ్యూనికేషన్స్ విభాగం ఎస్సై, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల సైంటిఫిక్ అసిస్టెంట్లు, కమ్యూనికేషన్స్ కానిస్టేబుళ్లు, పీటీవోలో డ్రైవర్ అండ్ మెకానిక్‌లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలో ప్రకటిస్తామని నియామక మండలి తెలిపింది.
దరఖాస్తు నింపే ముందు అభ్యర్థులు సంబంధిత నోటిఫికేషన్లను పూర్తిగా చదవాలని ఎస్‌ఎల్‌పీఆర్‌బీ సూచించింది. అర్హతలు, వయోపరిమితి, విద్యార్హతలు, సిలబస్, పరీక్ష ఫీజు, ఇతర నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత తుది ఫారమ్ ప్రింట్ ఔట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.
సాంకేతిక లేదా సాధారణ సందేహాల కోసం https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌లోని హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి.అభ్యర్థుల నుంచి నేరుగా వచ్చే లేఖలు లేదా వినతులను బోర్డు పరిగణనలోకి తీసుకోదు.

E-Paper
