7 seater electric cars : ఇండియాలో అఫార్డిబుల్ 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు ఇవి..
Family electric cars : భారత ఆటోమొబైల్ రంగంలో ఫ్యామిలీ కార్ల డిమాండ్ పెరగడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) హవా కొనసాగుతోంది. పెద్ద కుటుంబాలకు సరిపోయేలా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే వీలున్న టాప్ అఫార్డబుల్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు మీకోసం..
Budget electric cars in India : పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న తరుణంలో.. మధ్యతరగతి కుటుంబాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలకు సరిపోయేలా 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు జేబుకు భారం కాని రీతిలో, ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న అఫార్డిబుల్ 7-సీటర్ ఈవీల వివరాలను ఇక్కడ చూసేయండి..

1. కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ..
ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన 7-సీటర్ ఎలక్ట్రిక్ కారుగా 'కియా క్యారెన్స్ క్లేవిస్' నిలిచింది.
ధర: దీని ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
బ్యాటరీ అండ్ పవర్: ఇందులో 42 kWh, 51.4 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.
రేంజ్: చిన్న బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 404 కి.మీ రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఏకంగా 490 కి.మీ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
2. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్..
దేశీ దిగ్గజం మహీంద్రా తన ప్రతిష్టాత్మక 'INGLO' ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన తొలి గ్రౌండ్-అప్ ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎస్యూవీ ఇది.
ధర: రూ. 19.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో గతేడాది నవంబర్‌లో లాంచ్ అయింది.
ప్రత్యేకత: కస్టమర్ల అవసరాల కోసం ఇందులో మూడు రకాల బ్యాటరీ ప్యాక్‌లను (59 kWh, 70 kWh, 79 kWh) అందించారు. గరిష్టంగా 210 కేడబ్ల్యూ పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ కారు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో వస్తుంది.
3. విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7..
ఈ జాబితాలో సరికొత్తగా చేరిన కారు విన్‌ఫాస్ట్. వియత్నాంకు చెందిన ఈ ఆటో దిగ్గజం భారత మార్కెట్లోకి తన ఫ్యామిలీ ఈవీని విడుదల చేసింది.
ధర: దీని ప్రారంభ ధర రూ. 24.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
రేంజ్: ఇందులో ఉన్న 60.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 201 hp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది సిటీ, హైవే ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది.
4. బీవైడీ ఈ మ్యాక్స్ 7..
చైనా ఈవీ దిగ్గజం బీవైడీ నుంచి వచ్చిన ఈ మోడల్ విన్‌ఫాస్ట్‌కు గట్టి పోటీనిస్తోంది.
ధర: ప్రారంభ ధర రూ. 26.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).
వేరియంట్లు: ఇది ‘ప్రీమియం’, 'సుపీరియర్' అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. సుపీరియర్ వేరియంట్ 71.8 kWh బ్యాటరీతో వస్తూ గరిష్టంగా 530 కి.మీ రేంజ్ (క్లెయిమ్డ్) అందిస్తుంది. ప్రీమియం ఫీచర్లు, రిలయబిలిటీ కోరుకునే వారికి ఇది చక్కటి ఎంపిక.
మరి వీటిల్లో మీరు ఏ 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారను ఎంచుకోబోతున్నారు?
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. భారతదేశంలో చౌకైన 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు ఏది?
కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV) ప్రస్తుతం రూ. 17.99 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో అత్యంత సరసమైన 7-సీటర్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది.
2. మహీంద్రా XEV 9S రేంజ్ ఎంత?
మహీంద్రా XEV 9S లో మూడు బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. దీని అధికారిక రేంజ్ వివరాలు బ్యాటరీ ప్యాక్ ఆధారంగా మారుతుంటాయి (సుమారు 450-500 కి.మీ మధ్య ఉండే అవకాశం ఉంది).
3. ఎలక్ట్రిక్ 7-సీటర్ కార్లకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుందా?
అవును, పెట్రోల్ లేదా డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లలో కదిలే భాగాలు (Moving Parts) తక్కువగా ఉండటం వల్ల సర్వీసింగ్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
4. విన్‌ఫాస్ట్ VF MPV 7 ప్రధాన ఫీచర్ ఏంటి?
దీని ప్రధాన ఆకర్షణ సింగిల్ ఛార్జ్‌పై ఇచ్చే 517 కి.మీ రేంజ్. బడ్జెట్ ధరలో ఇంత ఎక్కువ రేంజ్ ఇవ్వడం విశేషం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


