7000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- రూ. 15వేల ధరలోపు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ఇవి..
రూ.15వేల ధరలోపు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్-5 బడ్జెట్ గ్యాడ్జెట్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
ప్రస్తుతం రూ. 15,000 లోపు ధరల విభాగంలో అత్యుత్తమ విలువను, అద్భుతమైన ఫీచర్లు అందించే అనేక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఖరీదైన ఫోన్‌లకే పరిమితమైన ఫీచర్లు సైతం ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభిస్తున్నాయి. అయితే దాదాపు ప్రతి వారం కొత్త ఫోన్‌లు మార్కెట్‌లోకి వస్తుండడం, ప్రతి ఒక్కటి తామే 'బడ్జెట్ కింగ్' అని చెప్పుకోవడంతో మన అవసరాలకు తగిన, సరైన ఫోన్‌ను ఎంచుకోవడం కష్టంగా మారింది.

ఈ గందరగోళాన్ని తగ్గించడానికి, మేము రూ. 15వేల ధరల విభాగంలో అత్యధిక విలువను అందించే, దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా ఉపయోగపడే సామర్థ్యం ఉన్న 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాము. చూసేయండి..
రూ. 15వేల ధరలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..
1) ఇన్ఫీనిక్స్ నోట్ 50ఎస్..
డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
కెమెరా: ఇన్ఫీనిక్స్ నోట్ 50ఎస్ వెనుకవైపు 64ఎంపీ సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ షూటర్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ కెమెరా ఇచ్చారు.
ప్రాసెసర్ అండ్ స్టోరేజ్: ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పాటు Mali-G615 MC2 GPUతో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ LPDDR5X ర్యామ్, 128జబీ/256జబీ UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
బ్యాటరీ: ఈ ఫోన్‌లో 5500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఇన్ఫినిక్స్ సొంత ఎక్స్ఓఎస్ 15పై ఈ ఫోన్ నడుస్తుంది. దీనికి 2 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
2) ఐక్యూ జెడ్10ఎక్స్..
డిస్‌ప్లే: 6.72 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తోంది ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.
ప్రాసెసర్ అండ్ స్టోరేజ్: ఈ ఐక్యూ జెడ్10ఎక్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. ఇది 6జీబీ/8జీబీ LPDDR4x ర్యామ్, 128GB/256GB UFS 3.1 స్టోరేజ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
కెమెరా: ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: ఇందులో 6500ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 15పై ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనికి 2 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.
3) టెక్నో పోవా 7..
డిస్‌ప్లే: ఈ గ్యాడ్జెట్లో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
ప్రాసెసర్ & స్టోరేజ్: ఇందులో డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంది. 8జీబీ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజ్‌తో పనిచేస్తుంది.
కెమెరా: ఈ టెక్నో పోవా 7 ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ షూటర్, ఒక సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
4) ఒప్పో కే13..
డిస్‌ప్లే: ఒప్పో కే13 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇందులో ఉన్నాయి.
ప్రాసెసర్ అండ్ స్టోరేజ్: ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8జీబీ LPDDR4x ర్యామ్, 128జీబీ/256జీబీ UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
కెమెరా: కెమెరా పరంగా, కే13 5జీలో 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ సెన్సార్ ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ షూటర్ ఇచ్చారు.
బ్యాటరీ (USP): ఈ ఫోన్ యొక్క ప్రధాన ప్రత్యేకత దాని 7000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం. ఇది 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: ఒప్పో కే13 5జీ కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15పై నడుస్తుంది. దీనికి 2 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ వాగ్దానం చేసింది.
5) హానర్ ఎక్స్7సీ..
డిస్‌ప్లే: ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వరకు, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
ప్రాసెసర్ & సాఫ్ట్‌వేర్: ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 8.0 పై నడుస్తుంది.
బ్యాటరీ: ఈ హానర్ ఎక్స్7సీ ఫోన్‌లో 5200ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 35డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: ఆప్టిక్స్ కోసం, హానర్ ఎక్స్7సీ 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ షూటర్ ఉంది.
మరి మీరు ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


