Festival Discounts on cars : టాటా కార్లపై నవరాత్రి డిస్కౌంట్లు- రూ. 3.3లక్షల వరకు బెనిఫిట్స్!
నవరాత్రి, దసరా పండుగల సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ తమ పాపులర్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, నెక్సాన్, ఆల్ట్రోజ్ మోడళ్లపై లభిస్తున్న ఆఫర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నవరాత్రి, విజయదశమి పండుగల వేళ సరికొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారీ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తమ విస్తృతమైన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికారిక షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభిస్తున్నాయి. ఇంధన (ఐసీఈ) మోడళ్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపైనే (ఈవీ) టాటా మోటార్స్ అత్యధిక ప్రయోజనాలను అందించడం విశేషం.

టాటా కర్వ్, హారియర్ ఈవీ పై రూ. 3.35 లక్షల వరకు..
టాటా తమ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోపై అత్యంత భారీ తగ్గింపులను ప్రకటించింది.
టాటా కర్వ్ ఈవీ : కంపెనీ విక్రయిస్తున్న ప్యాసింజర్ వాహనాల్లో అత్యధికంగా 'కర్వ్ ఈవీ' (ఎక్స్ వేరియంట్లు మినహా) మోడల్‌పై ఏకంగా రూ. 3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. కర్వ్ ఈవీ క్రియేటివ్ వేరియంట్‌పై రూ. 2.85 లక్షలు, ఎక్స్ వేరియంట్లపై రూ. 65,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
టాటా హారియర్ ఈవీ: ఇటీవల అందుబాటులోకి వచ్చిన హారియర్ ఈవీ ఫియర్లెస్, ఎంపవర్డ్ వేరియంట్లపై రూ. 2.75 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇందులో రూ. 1 లక్ష ఓఈఎమ్ సపోర్ట్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 75,000 స్క్రాపేజ్ ఆఫర్‌తో పాటు రూ. 50,000 లాయల్టీ ప్రయోజనాలు ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ: పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ మోడల్‌పై రూ. 1.45 లక్షలు, మీడియం రేంజ్‌పై రూ. 1.25 లక్షలు, స్మార్ట్ వేరియంట్‌పై రూ. 95,000 వరకు లభిస్తున్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ : నెక్సాన్ ఈవీ పై రూ. 10,000 గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌తో కలిపి మొత్తం రూ. 45,000 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది.
నెక్సాన్, కర్వ్ ఐసీఈ మోడళ్లపై డిస్కౌంట్లు..
ఇంధన (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జి) కార్లపై కూడా కంపెనీ చెప్పుకోదగ్గ తగ్గింపులను అందించింది.
టాటా కర్వ్ ఐసీఈ : నాన్-ఎ్స్ వేరియంట్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 30,000 కన్స్యూమర్ ప్రయోజనం, రూ. 50,000 లాయల్టీ రివార్డ్, రూ. 40,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ. 45,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఇక కర్వ్ ఎక్స్ వేరియంట్‌పై రూ. 20,000 లాయల్టీ బెనిఫిట్ ఉంది.
టాటా నెక్సాన్ ఐసీఈ : పెట్రోల్ మాన్యువల్ మోడళ్లపై రూ. 75,000 వరకు, సీఎన్జీ వేరియంట్లపై రూ. 60,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ మోడళ్లపై వరుసగా రూ. 55,000, రూ. 20,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.
హారియర్, సఫారీ, సియెర్రా : హారియర్, సఫారీ ఐసీఈ మోడళ్లపై రూ. 45,000 వరకు (రూ. 10,000 కన్స్యూమర్ బెనిఫిట్ + రూ. 25,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ. 35,000 స్క్రాపేజ్) ప్రయోజనం పొందే వీలుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై రూ. 30,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
హ్యాచ్‌బ్యాక్, సెడాన్ ఆఫర్లు.. వీటిపై ఆఫర్లు లేవు!
చిన్న కార్ల విభాగంలో టాటా టియాగో పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లపై రూ. 35,000 వరకు, టాటా టిగోర్ సెడాన్‌పై రూ. 30,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్లపై రూ. 55,000 వరకు, పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై రూ. 35,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు.
కాగా, టాటా ఏరిస్ మోడల్‌తో పాటు టాటా పంచ్ ఐసీఈ పెట్రోల్/డీజిల్ మోడళ్లపై ఎలాంటి పండుగ ఆఫర్లను కంపెనీ ప్రకటించలేదు.
నవరాత్రి, దశమి పండుగ వేళ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎక్స్ఛేంజ్ బోనస్, పాత వాహనాల స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, లాయల్టీ క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ఈ రాయితీలను టాటా ఆటోమొబైల్ డీలర్లు అందిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


