...
...
Next Story

Discounts on cars : పండుగల వేళ గుడ్ న్యూస్- మారుతీ సుజుకీ కార్లపై అదిరే ఆఫర్లు..

పండగల సీజన్ నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ నెక్సా సిరీస్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీ సహా పలు పాపులర్ మోడళ్లపై లభించే ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్ బోనస్ల పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 4, 2026, 08:16:04 IST
Advertisement

పండగల వేళ కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మారుతీ సుజుకీ తీపి కబురు అందించింది. అక్టోబర్ 2026 పండగల సీజన్‌‌ను పురస్కరించుకుని తన ప్రీమియం నెక్సా షోరూమ్ శ్రేణి కార్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. దసరా, నవరాత్రుల సందడిని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు కార్లను బుక్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీ-నవరాత్రి బుకింగ్ ఆఫర్లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా..
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా..

ఈ నేపథ్యంలో ఈ అక్టోబర్​ 2026లో మారుతీ సుజుకీ కార్లపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూసేయండి.

గ్రాండ్ విటారాపై భారీ పొదుపు..

మారుతీ నెక్సా శ్రేణిలో అత్యధికంగా గ్రాండ్ విటారా మోడల్‌పై కంపెనీ బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

సిగ్మా పెట్రోల్ వేరియంట్: పెట్రోల్ సిగ్మా వేరియంట్‌‌పై వినియోగదారులు రూ.1.36 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. ఇందులో రూ.35,000 కన్స్యూమర్ డిస్కౌంట్‌తో పాటు రూ.30,000 వరకు ఎక్స్​ఛేంజ్ బోనస్, ఇతర కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి.

డెల్టా పెట్రోల్ వేరియంట్: డెల్టా పెట్రోల్ వెర్షన్‌పై రూ.1.26 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

జెటా, ఆల్ఫా అండ్ ఏడబ్ల్యూడీ: జెటా, ఆల్ఫా, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లపై రూ.1.15 లక్షల ప్రయోజనాలతో పాటు 5 సంవత్సరాల ఎక్స్​టెండెట్ వారంటీని అందిస్తున్నారు.

స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్: అత్యధికంగా స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడళ్లపై రోడ్ టాక్స్ మినహాయింపులతో కలిపి ఏకంగా రూ.1.85 లక్షల వరకు భారీ లబ్ధి చేకూరనుంది.

సీఎన్జీ వేరియంట్లు: పర్యావరణ హితమైన సీఎన్జీ మోడళ్లను ఆశించే వారికి కూడా ఆఫర్లు ఉన్నాయి. డెల్టా సీఎన్జీపై రూ.1 లక్ష వరకు, జెటా సీఎన్జీపై రూ.90,000 వరకు తగ్గింపులు లభిస్తాయి.

ఫ్రాంక్స్, ఎక్స్‌ఎల్6, ఇన్విక్టో ఆఫర్లు..

ఫ్రాంక్స్ : టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ.27,100 వరకు, 1.2-లీటర్ పెట్రోల్ మోడల్‌‌పై రూ.22,100 వరకు, సీఎన్జీ మోడల్‌పై రూ.15,000 వరకు డిస్కౌంట్లు వర్తిస్తాయి.

ఎక్స్‌ఎల్6 : ఫ్యామిలీ కార్ ఎక్స్‌ఎల్6 పెట్రోల్ మోడళ్లపై రూ.61,000 వరకు, సీఎన్జీ వేరియంట్‌పై రూ.50,000 వరకు పొదుపు చేయవచ్చు.

ఇన్విక్టో : ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టో అన్ని వేరియంట్లపై రూ.95,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

జిమ్నీ: ఆఫ్-రోడర్ జీప్ జిమ్నీపై ఎలాంటి నిబంధనలు లేకుండా నేరుగా రూ.35,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ విటారా : ఎలక్ట్రిక్ కారు ఈ విటారా కొనుగోలుదారులకు ఉచిత ఛార్జర్, హోమ్ ఇన్‌స్టాలేషన్ సదుపాయాన్ని ప్యాకేజీగా అందిస్తున్నారు.

ఆఫర్ నిబంధనలు ఇవే..

కంపెనీ ప్రకటించిన ప్రయోజనాలు కేవలం డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూపంలో మాత్రమే ఉండవని గుర్తించాలి. కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్​ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల కలయిక ఆధారంగా తుది డిస్కౌంట్​ను లెక్కిస్తారు. కొనుగోలుదారులు ఎక్స్​ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్లలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. పాత మారుతీ సుజుకీ కారు కలిగిన కస్టమర్లు ఎక్స్​ఛేంజ్ బోనస్‌తో పాటు అదనంగా లాయల్టీ బోనస్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు.

పండగ సీజన్ ఆరంభంలోనే కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రీ-నవరాత్రి ఆఫర్లు మంచి పొదుపును ఇస్తాయని ఆటోమొబైల్ విశ్లేషకులు చెబుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks