Discounts on cars : పండుగల వేళ గుడ్ న్యూస్- మారుతీ సుజుకీ కార్లపై అదిరే ఆఫర్లు..
పండగల సీజన్ నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ నెక్సా సిరీస్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీ సహా పలు పాపులర్ మోడళ్లపై లభించే ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ల పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
పండగల వేళ కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మారుతీ సుజుకీ తీపి కబురు అందించింది. అక్టోబర్ 2026 పండగల సీజన్‌ను పురస్కరించుకుని తన ప్రీమియం నెక్సా షోరూమ్ శ్రేణి కార్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. దసరా, నవరాత్రుల సందడిని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు కార్లను బుక్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీ-నవరాత్రి బుకింగ్ ఆఫర్లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ అక్టోబర్ 2026లో మారుతీ సుజుకీ కార్లపై లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ చూసేయండి.
గ్రాండ్ విటారాపై భారీ పొదుపు..
మారుతీ నెక్సా శ్రేణిలో అత్యధికంగా గ్రాండ్ విటారా మోడల్‌పై కంపెనీ బంపర్ ఆఫర్లను ప్రకటించింది.
సిగ్మా పెట్రోల్ వేరియంట్: పెట్రోల్ సిగ్మా వేరియంట్‌పై వినియోగదారులు రూ.1.36 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. ఇందులో రూ.35,000 కన్స్యూమర్ డిస్కౌంట్‌తో పాటు రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి.
డెల్టా పెట్రోల్ వేరియంట్: డెల్టా పెట్రోల్ వెర్షన్‌పై రూ.1.26 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
జెటా, ఆల్ఫా అండ్ ఏడబ్ల్యూడీ: జెటా, ఆల్ఫా, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లపై రూ.1.15 లక్షల ప్రయోజనాలతో పాటు 5 సంవత్సరాల ఎక్స్టెండెట్ వారంటీని అందిస్తున్నారు.
స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్: అత్యధికంగా స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడళ్లపై రోడ్ టాక్స్ మినహాయింపులతో కలిపి ఏకంగా రూ.1.85 లక్షల వరకు భారీ లబ్ధి చేకూరనుంది.
సీఎన్జీ వేరియంట్లు: పర్యావరణ హితమైన సీఎన్జీ మోడళ్లను ఆశించే వారికి కూడా ఆఫర్లు ఉన్నాయి. డెల్టా సీఎన్జీపై రూ.1 లక్ష వరకు, జెటా సీఎన్జీపై రూ.90,000 వరకు తగ్గింపులు లభిస్తాయి.
ఫ్రాంక్స్, ఎక్స్‌ఎల్6, ఇన్విక్టో ఆఫర్లు..
మారుతీ సుజుకీకి చెందిన ఇతర పాపులర్ ఎస్‌యూవీలు, ఎంపీవీలపై కూడా ఆకర్షణీయ ప్రయోజనాలు ఉన్నాయి:
ఫ్రాంక్స్ : టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ.27,100 వరకు, 1.2-లీటర్ పెట్రోల్ మోడల్‌పై రూ.22,100 వరకు, సీఎన్జీ మోడల్‌పై రూ.15,000 వరకు డిస్కౌంట్లు వర్తిస్తాయి.
ఎక్స్‌ఎల్6 : ఫ్యామిలీ కార్ ఎక్స్‌ఎల్6 పెట్రోల్ మోడళ్లపై రూ.61,000 వరకు, సీఎన్జీ వేరియంట్‌పై రూ.50,000 వరకు పొదుపు చేయవచ్చు.
ఇన్విక్టో : ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టో అన్ని వేరియంట్లపై రూ.95,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
జిమ్నీ: ఆఫ్-రోడర్ జీప్ జిమ్నీపై ఎలాంటి నిబంధనలు లేకుండా నేరుగా రూ.35,000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ విటారా : ఎలక్ట్రిక్ కారు ఈ విటారా కొనుగోలుదారులకు ఉచిత ఛార్జర్, హోమ్ ఇన్‌స్టాలేషన్ సదుపాయాన్ని ప్యాకేజీగా అందిస్తున్నారు.
ఆఫర్ నిబంధనలు ఇవే..
కంపెనీ ప్రకటించిన ప్రయోజనాలు కేవలం డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూపంలో మాత్రమే ఉండవని గుర్తించాలి. కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల కలయిక ఆధారంగా తుది డిస్కౌంట్‌ను లెక్కిస్తారు. కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్లలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. పాత మారుతీ సుజుకీ కారు కలిగిన కస్టమర్లు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు అదనంగా లాయల్టీ బోనస్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు.
పండగ సీజన్ ఆరంభంలోనే కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రీ-నవరాత్రి ఆఫర్లు మంచి పొదుపును ఇస్తాయని ఆటోమొబైల్ విశ్లేషకులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


