NEET UG 2026 : ఈ నీట్ యూజీ 2026 లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్స్‌తో 0 టెన్షన్..
NEET UG preparation tips : మే 3న జరగనున్న నీట్ యూజీ పరీక్షకు సమయం దగ్గరపడింది. ఈ తక్కువ సమయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఏయే చాప్టర్లపై పట్టు సాధించాలి? మెడికల్ సీటు సాధించే టాప్ ప్రిపరేషన్ టిప్స్ మీకోసం.
వైద్య విద్యార్థుల కలల సమరానికి గడువు ముగిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే నీట్ యూజీ 2026 పరీక్ష ఈ ఆదివారం, మే 3న జరగనుంది. పరీక్షకు కేవలం ఇంకొన్ని రోజులే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ చివరి నిమిషంలో కొత్త పాఠాలు చదవడం కంటే, చదివిన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి, ఏయే సబ్జెక్టుల్లోని కీలక టాపిక్స్‌పై దృష్టి పెట్టాలనే అంశాలను సీనియర్ ఫ్యాకల్టీలు వివరిస్తున్నారు.

నీట్ యూజీ 2026- ఫిజిక్స్ ప్రిపరేషన్ టిప్స్..
చాలా మంది నీట్ యూజీ విద్యార్థులకు ఫిజిక్స్ అంటే ఒకరకమైన భయం ఉంటుంది. కానీ పక్కా ప్లానింగ్‌తో ఇందులోనూ మంచి మార్కులు సాధించవచ్చు. సిలబస్ భారీగా ఉన్నా, కొన్ని కీలక విభాగాల నుంచి ప్రతి ఏటా ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. అవి..
మెకానిక్స్: లాస్ ఆఫ్ మోషన్, వర్క్-ఎనర్జీ థియరమ్ వంటి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.
ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ: ఈ విభాగం నుంచి వెయిటేజీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఆప్టిక్స్: రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్‌లోని సూత్రాలను ఒక్కసారి తిరగేయండి.
మోడరన్ ఫిజిక్స్: ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, అటామిక్ స్ట్రక్చర్ వంటి అంశాలు స్కోరింగ్‌కు బాగా ఉపయోగపడతాయి.
"ఫిజిక్స్‌లో థియరీ కంటే అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఫార్ములా షీట్‌ను నిత్యం రివైజ్ చేయాలి," అని నిపుణులు సూచిస్తున్నారు.
నీట్ యూజీ 2026- కెమిస్ట్రీ ప్రిపరేషన్ టిప్స్..
నీట్ యూజీ 2026 కోసం కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ అని మూడు భాగాలుగా విభజించుకుని ప్రిపేర్ అవ్వాలి.
ఆర్గానిక్ కెమిస్ట్రీ: హైడ్రోకార్బన్లు, ఆల్కహాల్స్, ఈథర్స్ వంటి విభాగాల్లోని రియాక్షన్స్ గుర్తుంచుకోండి.
ఫిజికల్ కెమిస్ట్రీ: మోల్ కాన్సెప్ట్, కెమికల్ కైనటిక్స్, థర్మోడైనమిక్స్‌లో లెక్కలను ప్రాక్టీస్ చేయండి.
ఇనార్గానిక్ కెమిస్ట్రీ: పీరియాడిక్ టేబుల్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్‌లోని ధర్మాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సులభమవుతుంది.
నీట్ యూజీ 2026- బయాలజీ ప్రిపరేషన్ టిప్స్..
నీట్‌లో అత్యధిక మార్కులు తెచ్చిపెట్టే సబ్జెక్టు బయాలజీ! ఇందులో డయాగ్రమ్స్, ఉదాహరణలు చాలా ముఖ్యం.
హ్యూమన్ ఫిజియాలజీ: జీర్ణక్రియ, రక్తప్రసరణ వంటి వ్యవస్థలపై స్పష్టత ఉండాలి.
ప్లాంట్ ఫిజియాలజీ: మొక్కల పెరుగుదల, కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలను క్షుణ్ణంగా చదవాలి.
జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్: ఈ విభాగం నుంచి లాజికల్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఎకాలజీ: పర్యావరణం, జీవవైవిధ్యం వంటి సులభమైన టాపిక్స్‌ను వదిలిపెట్టవద్దు.
నీట్ యూజీ 2026- లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్స్..
చివరి వారంలో చదివే పద్ధతి మీ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. అందుకే ఈ సూచనలు పాటించండి:
బలహీనతలపై ఫోకస్: మీరు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో వాటిని గుర్తించి, వాటికి రోజులో కొంత సమయం కేటాయించండి. అయితే మరీ కొత్త చాప్టర్లను మాత్రం ముట్టుకోవద్దు.
మాక్ టెస్టుల ప్రాక్టీస్: మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 గంటల మధ్యే మాక్ టెస్టులు రాయండి. దీనివల్ల పరీక్షా సమయంలో మీ మెదడు చురుగ్గా పనిచేయడానికి అలవాటు పడుతుంది.
కాన్సెప్ట్ క్లారిటీ: ఏదైనా విషయాన్ని బట్టీ పట్టకుండా, దాని వెనుక ఉన్న లాజిక్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఆరోగ్యం జాగ్రత్త: నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. రోజుకు కనీసం 7 గంటల నిద్ర, పౌష్టికాహారం తప్పనిసరి.
పాత ప్రశ్నపత్రాలు: గత ఐదేళ్ల నీట్ ప్రశ్నపత్రాలను విశ్లేషించడం వల్ల ఏ తరహా ప్రశ్నలు అడుగుతున్నారో ఒక అవగాహన వస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


