NEET UG 2026 : నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ విడుదల- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
NEET UG 2026 admit cards : నీట్ యూజీ 2026పై బిగ్ అప్డేట్! నీట్ యూజీ అడ్మిట్ కార్డ్‌లను ఎన్టీఏ విడుదల చేసింది. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? పరీక్ష ఎప్పుడు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వైద్య విద్యా ప్రవేశ పరీక్ష 'నీట్ యూజీ (NEET UG) 2026' అడ్మిట్ కార్డ్‌లను ఆదివారం విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను వెంటనే పొందవచ్చు.

మే 3న దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్ష..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష మే 3, 2026 (ఆదివారం) నాడు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయాన్ని కేటాయించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా నీట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్ పేజీలో కనిపించే 'NEET UG 2026 Admit Card' లింక్‌పై క్లిక్ చేయండి.
మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
స్క్రీన్‌పై కనిపించే హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఒకటికి రెండు ప్రింట్ అవుట్లు తీసుకోవడం ఉత్తమం.
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డ్‌లో ఇవి సరిచూసుకోండి..
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్టీఏ సూచించింది. ముఖ్యంగా పరీక్షా కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం, మీ పేరు, ఫోటో, సంతకం సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు అందులో పేర్కొన్న నిబంధనలను (డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువుల జాబిత) చదవడం మర్చిపోవద్దు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్‌ను లేదా ఈమెయిల్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు.
నీట్ యూజీ 2026- విద్యార్థులకు కీలక సూచనలు
నీట్ యూజీ 2026 పరీక్షా కేంద్రానికి కనీసం గంటన్నర ముందే చేరుకోవడం శ్రేయస్కరం. చివరి నిమిషంలో ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ కార్డును (ఆధార్/ పాన్) వెంట తీసుకెళ్లాలి. మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు ఈ అడ్మిట్ కార్డ్ అత్యంత కీలకమైన పత్రం. దీన్ని పరీక్ష పూర్తయ్యే వరకు మాత్రమే కాకుండా, కౌన్సెలింగ్ సమయం వరకు భద్రపరుచుకోవాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. నీట్ యూజీ 2026 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
నీట్ యూజీ పరీక్ష మే 3, 2026న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది.
2. అడ్మిట్ కార్డ్‌లో ఏవైనా తప్పులు ఉంటే ఏం చేయాలి?
వెంటనే ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలి లేదా అధికారిక ఈమెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపాలి.
3. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడానికి ఏ వివరాలు అవసరం?
మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ (Date of Birth) వివరాలు ఉంటే సరిపోతుంది.
4. పరీక్షా కేంద్రానికి ఏమేమి తీసుకువెళ్లాలి?
అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ కార్డు (ఆధార్ వంటివి) తప్పనిసరి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


