NEET UG 2026 : నీట్ యూజీ రిజిస్ట్రేషన్‌కి రేపే లాస్ట్ ఛాన్స్- ఎన్టీఏ కీలక సూచనలు..
NEET UG 2026 registration : నీట్ యూజీ 2026పై బిగ్ అప్డేట్! రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ సైతం కీలక సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ‘నీట్-యూజీ 2026’ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సమయం దగ్గర పడింది. రిజిస్ట్రేషన్ గడువు ముగింపు దశకు చేరుకోవడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా, వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్టీఏ సూచించింది.

ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఎన్టీఏ ఒక పోస్ట్ చేస్తూ.. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు తమ వివరాలను ఫైనల్ సబ్మిషన్కి ముందే మరోసారి జాగ్రత్తగా సమీక్షించుకోవాలని వెల్లడించింది.
"నీట్ (యూజీ) 2026 దరఖాస్తు గడువు మార్చి 8, 2026 తో ముగియనుంది. అభ్యర్థులు గడువు కంటే ముందే ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించాలని, ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచిస్తున్నాము," అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ గడువు వివరాలు..
నీట్ యూజీ 2026 అప్లికేషన్ విండో మార్చి 8వ తేదీన క్లోజ్ అవుతుంది. అభ్యర్థులు ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కోసం అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ విండో ఆదివారం రాత్రి 9:00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, పరీక్ష ఫీజును మాత్రం రాత్రి 11:50 గంటల వరకు చెల్లించే అవకాశం ఉంది.
నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు..
దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావాలంటే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది:
జనరల్ అభ్యర్థులు: రూ. 1,700
జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ. 1,600
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ. 1,000
నీట్ 2026 కు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ పాటించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు:
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించండి.
స్టెప్ 2: పేరు, చిరునామా, కేటగిరీ, కమ్యూనికేషన్ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 3: ఒక పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకుని సబ్మిట్ చేయండి.
స్టెప్ 4: అప్లికేషన్ ఫారమ్‌లోని మిగిలిన వివరాలను పూర్తి చేయండి.
స్టెప్ 5: లైవ్ ఫోటో క్యాప్చర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 6: రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్ 7: ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
స్టెప్ 8: కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోండి.
నీట్ యూజీ 2026- దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు ఈ కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
పోస్ట్‌కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్
ఎడమ, కుడి చేతి వేలిముద్రలు, బొటనవేలు ముద్రలు
సంతకం
కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
పదొవ తరగతి లేదా తత్సమాన పాస్ సర్టిఫికేట్
పదొవ తరగతి లేదా తత్సమాన మార్కుల జాబితా
పదొవ తరగతి సీజీపీఏని పర్సంటేజీలోకి మార్చిన కన్వర్షన్ సర్టిఫికేట్
గుర్తింపు కార్డు
ప్రస్తుత, శాశ్వత చిరునామా ధృవీకరణ పత్రం (అడ్రెస్ ప్రూఫ్)
పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ (దివ్యాంగులకు)
సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ (ఎన్ఆర్ఐ / ఓసీఐ/ విదేశీ పౌరులకు)
నీట్ యూజీ 2026 కరెక్షన్ విండో..
దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేయాలనుకునే వారి కోసం ఎన్టీఏ కరెక్షన్ విండోను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇది మార్చి 10, 2026 న ప్రారంభమై, మార్చి 12, 2026 తో ముగుస్తుంది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. నీట్ యూజీ 2026 దరఖాస్తు ఫారమ్‌లో పొరపాట్లు జరిగితే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి?
అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రత్యేకమైన 'కరెక్షన్ విండో'ను అందుబాటులోకి తెస్తుంది.
గడువు: ఈ ఏడాది కరెక్షన్ విండో మార్చి 10, 2026 నుంచి మార్చి 12, 2026 వరకు తెరిచి ఉంటుంది.
సూచన: అభ్యర్థులు తమ అధికారిక లాగిన్ ఐడి ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిర్ణీత సమయంలోపు వివరాలను మార్చుకోవచ్చు. అయితే, అన్ని వివరాలను మార్చుకోవడానికి వీలుండదు కాబట్టి, కరెక్షన్ విండో సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
2. దరఖాస్తు సమయంలో 'లైవ్ ఫోటో' క్యాప్చర్ చేయడం తప్పనిసరా? దీని కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అవును, నీట్ 2026 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థి తన 'లైవ్ ఫోటో'ను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు పాటించాలి:
బ్యాక్‌గ్రౌండ్: ఫోటో వెనుక భాగం తెల్లగా ఉండాలి, తగినంత వెలుతురు ఉండాలి.
స్పష్టత: అభ్యర్థి ముఖం స్పష్టంగా కనిపించాలి, కళ్లు తెరిచి ఉండాలి. టోపీలు, మాస్కులు లేదా డార్క్ గ్లాసెస్ (సన్‌గ్లాసెస్) ధరించకూడదు.
సాంకేతికత: వెబ్‌క్యామ్ లేదా మొబైల్ కెమెరా ద్వారా ఫోటో తీసుకునేటప్పుడు అది అస్పష్టంగా (బ్లర్) లేకుండా చూసుకోవాలి. దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే ఎన్టీఏ సూచించిన ప్రమాణాల ప్రకారమే ఫోటో ఉండాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












