NEET 2026 : నీట్​ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు, పరీక్ష తేదీ వివరాలు..

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET (UG) 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 8 నుండి ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పరీక్ష మే 3, 2026న జరగనుంది.

Published on: Feb 09, 2026 5:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జాతీయ స్థాయి పోటీ పరీక్ష NEET UG 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రారంభించింది. సిలబస్‌ను విడుదల చేసిన దాదాపు నెల రోజుల తర్వాత, తన అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, నీట్​ యూజీ 2026 పరీక్ష మే 3, 2026న జరగనుంది.

నీట్​ యూజీ 2026 అప్డేట్స్​..
నీట్​ యూజీ 2026 అప్డేట్స్​..

"భారతదేశంలోని అన్ని వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎన్టీఏ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది," అని అధికారిక నోటీసు పేర్కొంది. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్​, బీడీఎస్​తో పాటు బీఏఎంఎస్​, బీయూఎంఎస్​, బీఎస్​ఎంఎస్​ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

నీట్​ యూజీ 2026 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..

స్టెప్ 1: ఆన్‌లైన్‌లో నీట్​ యూజీ 2026కి రిజిస్టర్ చేసుకుని, సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.

స్టెప్ 2: ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, పాస్‌వర్డ్, సెక్యూరిటీ ప్రశ్న/సమాధానాలను ఎంచుకోవాలి.

స్టెప్ 3: పరీక్ష ఫీజు చెల్లించాలి.

స్టెప్ 4: భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

నీట్​ యూజీ 2026- ముఖ్యమైన తేదీలు, సమయాలు..

నీట్​ యూజీ 2026 రిజిస్ట్రేషన్ లింక్ ఫిబ్రవరి 8న యాక్టివేట్ అయ్యింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 8, 2026 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు రాత్రి 9:00 గంటల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. రాత్రి 11:50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్‌లో తప్పుల సవరణ కోసం కరెక్షన్ విండో మార్చి 10న తెరుచుకుని, మార్చి 12న ముగుస్తుంది.

ఇక నీట్​ యూజీ 2026 పరీక్ష మే 3న మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు (3 గంటల పాటు) జరుగుతుంది.

నీట్​ యూజీ 2026- పరీక్ష ఫీజు వివరాలు..

జనరల్ అభ్యర్థులు: రూ. 1700

జనరల్​-ఈడబ్ల్యూఎస్​/ఓబీసీ-ఎన్​సీఎల్​: రూ. 1600

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జెండర్: రూ. 1000

విదేశీ సెంటర్లలో రాసేవారు: రూ. 9500 (అన్ని కేటగిరీలకు)

నీట్​ యూజీ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడం నుంచి ఫీజు చెల్లింపు వరకు అంతా ఆన్‌లైనే కాబట్టి, ఎటువంటి పేపర్లను ఎన్టీఏ కార్యాలయానికి పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా పంపాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

నీట్​ యూజీ 2026- ఎగ్జామ్​ పాటర్న్​..

నీట్​ యూజీ 2026లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల నుంచి చెరో 45 ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ విభాగం నుంచి అత్యధిక వెయిటేజీతో 90 ప్రశ్నలు ఉంటాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More