ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓమెగా సైకి మొబిలిటీ (ఓఎస్ఎం), ఇప్పుడు సామాన్యుల ప్రయాణ అవసరాలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఈ కంపెనీ, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ ‘ఓఎస్ఎం వెక్స్ట్రా’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 99,900గా నిర్ణయించింది.
ఓఎస్ఎం వెక్స్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్- సిటీ రైడింగ్ కోసం..

పట్టణ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించారు. ఇది గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ఓఎస్ఎం వెక్స్ట్రాని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇంట్లోనే వాడుకునే ఛార్జర్‌తో కేవలం 4 గంటల్లోనే 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ నిండుతుంది. పూర్తి ఛార్జింగ్ కావడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది.
ఓఎస్ఎం వెక్స్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్- ఆధునిక ఫీచర్లు.. స్మార్ట్ డ్రైవింగ్
ఓఎస్ఎం వెక్స్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రైడర్ల సౌకర్యం కోసం అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించారు:
డిస్‌ప్లే: బ్యాటరీ ఛార్జ్, స్పీడ్, ప్రయాణించాల్సిన దూరాన్ని సూచించే 3.5 ఇంచ్ కలర్ ఎల్‌సీడీ స్క్రీన్.
రైడింగ్ మోడ్స్: అవసరాన్ని బట్టి ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు మోడ్లలో డ్రైవ్ చేయవచ్చు.
అదనపు సదుపాయాలు: ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ సులభతరం చేసే రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ వంటివి ఉన్నాయి. అవసరమైతే జీఎస్ఎం కనెక్టివిటీని కూడా పొందే వీలుంది.
సామర్థ్యం: ఈ వాహనం 12 డిగ్రీల వరకు వాలు ఉన్న రోడ్లను కూడా సునాయాసంగా ఎక్కగలదు.
{{/usCountry}}సామర్థ్యం: ఈ వాహనం 12 డిగ్రీల వరకు వాలు ఉన్న రోడ్లను కూడా సునాయాసంగా ఎక్కగలదు.
{{/usCountry}}దేశవ్యాప్తంగా లభ్యత భారతదేశంలోని టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో ఉన్న 200 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌ల ద్వారా ఓఎస్ఎం వెక్స్ట్రాని విక్రయించాలని ఓమెగా సైకి లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం భారత్‌లోనే కాకుండా, ఆఫ్రికా దేశాలకు కూడా ఈ వాహనాన్ని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని ప్లాంట్‌లో ఏడాదికి 25,000 ఓఎస్ఎం వెక్స్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిట్లను తయారు చేసే సామర్థ్యం తమకు ఉందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్ల కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఓమెగా సెైకి మొబిలిటీ స్పష్టం చేసింది.