...
...
Next Story

Xiaomi 17 Max : 200ఎంపీ కెమెరా, 8000ఎంఏహెచ్​ బ్యాటరీ- షావోమీ నుంచి మాన్​స్టర్​ ఫోన్ ఇదిగో..

Xiaomi 17 Max price : షావోమీ నుంచి కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్ చైనాలో లాంచ్​ అయ్యింది. దీని పేరు షావోమీ 17 మ్యాక్స్. ఇది ఇండియాలో కూడా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: May 22, 2026, 09:08:16 IST
Advertisement

Xiaomi 17 Max India launch : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ సరికొత్త మొబైల్‌ను మార్కెట్​లోకి తీసుకొచ్చింది. గురువారం చైనాలో జరిగిన కంపెనీ మే 2026 ఈవెంట్‌లో ‘షావోమీ 17 మ్యాక్స్’ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ గ్యాడ్జెట్​తో పాటు ఈ ఈవెంట్‌లో షావోమీ తన సరికొత్త వైయూ7 జీటీ ఎలక్ట్రిక్ కారు, షావోమీ బ్యాండ్ 10 ప్రో, ఎయిర్ క్లిప్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను కూడా ప్రదర్శించింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఈ షావోమీ 17 మ్యాక్స్ స్మార్ట్‌ఫోనే.

షావోమీ 17 మ్యాక్స్- ధర, లభ్యత వివరాలు..

షావోమీ 17 మ్యాక్స్.. (Representative Image)
షావోమీ 17 మ్యాక్స్.. (Representative Image)

చైనాలో ఈ స్మార్ట్​ఫోన్ ధరలు కింది విధంగా ఉన్నాయి:

12GB RAM + 256GB స్టోరేజ్ (బేస్ వేరియంట్): దీని ధర 4,799 యువాన్ (భారత కరెన్సీలో సుమారు రూ. 68,000).

16GB RAM + 256GB స్టోరేజ్: దీని ధర 5,099 యువాన్ (సుమారు రూ. 72,000).

12GB RAM + 512GB స్టోరేజ్: దీని ధర 5,399 యువాన్ (సుమారు రూ. 76,000).

16GB RAM + 512GB స్టోరేజ్ (టాప్ ఎండ్): దీని ధర 5,799 యువాన్ (సుమారు రూ. 82,000).

ఈ స్మార్ట్​ఫోన్ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. మే 25 నుంచి షావోమీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది పిక్సెల్ బ్లాక్, స్కై బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

షావోమీ 17 మ్యాక్స్ ఫీచర్లు..

సినిమాటిక్ డిస్‌ప్లే: ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ 6.9-ఇంచ్ భారీ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం ఇందులో అధునాతన 'డ్రాగన్ క్రిస్టల్ 3.0' ప్రొటెక్షన్‌ను అందించారు. అలాగే కారుకు ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత సంస్థ సరికొత్త హైపర్ ఓఎస్ 3పై పని చేస్తుంది.

200ఎంపీ లైకా ట్రిపుల్ కెమెరా: ఫ్యాన్స్ ఎంతో ఇష్టపడే లైకా ట్యూనింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో ఉంది. శాంసంగ్ హెచ్​పీ9 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. దీనితో పాటు 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

ఈ సిరీస్‌లోనే బిగ్గెస్ట్ బ్యాటరీ: షావోమీ 17 సిరీస్ ఫోన్లన్నింటిలో కల్లా ఇందులో అత్యధికంగా 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ప్యాక్ చేశారు. దీనిని వేగంగా చార్జ్ చేయడానికి 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, ఇతర డివైజ్‌లను చార్జ్ చేసుకోవడానికి 22.5డబ్ల్యూ వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

కనెక్టివిటీ పరంగా ఇందులో 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, భారతీయ జీపీఎస్ వ్యవస్థ అయిన నావిక్ సపోర్ట్‌లను అందించారు. బరువు దాదాపు 225 గ్రాములు ఉండే ఈ ఫోన్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలోనూ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe