భారత్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో మోడల్ అడుగుపెట్టింది. ఈసీ-06 పేరుతో యమహా సంస్థ కొత్త ఈ-స్కూటర్ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 1.68లక్షలుగా ఉంది. ఇది భారత్‌లో యమహా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రివర్ ఇండీ ఆధారంగా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్..

యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్.. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ రూపొందించిన 'ఇండీ' మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. రివర్ సంస్థతో కలిసి యమహా తన సొంత వెర్షన్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోందని గతేడాది అనేక వార్తలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగానే యమహా 2025 చివరిలో ఈ ఈసీ-06ని ప్రదర్శించింది.
యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్- పనితీరు..
ఈ యమహా ఈసీ-06 ఈ- స్కూటర్‌లో రివర్ ఇండీలోని 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌నే ఉపయోగించారు. దీని మోటార్ 6.7 కేబ్ల్యూ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తిగా ఇండీ మోడల్ సెటప్‌తో సమానంగా ఉంటుంది. అయితే, దీని గరిష్ట వేగం గంటకు 79 కి.మీగా ఉంది. ఇది రివర్ ఇండీ కంటే 11 కి.మీ తక్కువ.
ఈసీ-06 ఛాసిస్ కూడా ఇండియా మోడల్‌ను పోలి ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో కలర్ ఎల్‌సీడీ, మూడు రైడింగ్ మోడ్స్, రివర్స్ అసిస్ట్ వంటి వసతులు ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈసీ-06లోని ఎల్‌సీడీ లేఅవుట్ పాత రివర్ ఇండీ మాదిరిగానే ఉంటుంది. గతేడాది లాంచ్ అయిన జెన్ 2.5లో కొత్త లేఅవుట్ ఇచ్చారు.
యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్- రేంజ్, ఛార్జింగ్..
యమహా ఈసీ-06 ఐడీసీ రేటెడ్ రేంజ్ 169 కి.మీగా ఉంది. ఇది రివర్ ఇండీ కంటే 6 కి.మీ అదనంగా ఉండటం విశేషం. 0-80 శాతం ఛార్జింగ్ కావడానికి 8 గంటల సమయం పడుతుందని యమహా పేర్కొంది. రివర్ ఇండియాలో 750డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ ఉన్నప్పటికీ, యమహా EC-06లో మాత్రం ఆ సదుపాయం లేదు.
యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్- డిజైన్, స్టోరేజ్ మధ్య వ్యత్యాసాలు..
{{/usCountry}}యమహా ఈసీ-06 ఐడీసీ రేటెడ్ రేంజ్ 169 కి.మీగా ఉంది. ఇది రివర్ ఇండీ కంటే 6 కి.మీ అదనంగా ఉండటం విశేషం. 0-80 శాతం ఛార్జింగ్ కావడానికి 8 గంటల సమయం పడుతుందని యమహా పేర్కొంది. రివర్ ఇండియాలో 750డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ ఉన్నప్పటికీ, యమహా EC-06లో మాత్రం ఆ సదుపాయం లేదు.
యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్- డిజైన్, స్టోరేజ్ మధ్య వ్యత్యాసాలు..
{{/usCountry}}రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధాన బలం దాని స్టోరేజ్ స్పేస్! అందులో 43 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు ఫ్రంట్ ఏప్రాన్‌లో 12 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది. దీనికి భిన్నంగా, యమహా ఈసీ-06 స్లీకర్ ప్యానెల్స్‌ను కలిగి ఉంది. ఇందులో సీటు కింద 24.5 లీటర్ల స్టోరేజ్, ఫ్రంట్ ఏప్రాన్‌లో ఓపెన్ కబ్బీ (చిన్న స్టోరేజ్ బాక్స్) మాత్రమే ఉన్నాయి. స్టోరేజ్ తగ్గడం వల్ల ఈ వాహనం బరువు కూడా.. రివర్ ఇండీ కంటే 3 కేజీలు తగ్గి, మొత్తం 132 కేజీలుగా ఉంది.
డిజైన్ పరంగా చూస్తే.. రివర్ ఇండీ బాక్సీగా, యుటిలిటీ వాహనంలా ఉంటే.. ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం ఎంతో షార్ప్, స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఇందులోని హెడ్‌లైట్, టెయిల్ లైట్ రివర్ ఇండీ కంటే చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తాయి.
యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్ స్కూటర్- ధర, లభ్యత..
రూ. 1.68 లక్షల ధర వద్ద ఉన్న యమహా ఈసీ-06, రివర్ ఇండీ కంటే రూ. 22,000 ఎక్కువ ధరను కలిగి ఉంది. ప్రస్తుతానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉన్న ఈ స్కూటర్, యమహా బ్యాడ్జ్ ధరించినప్పటికీ.. కర్ణాటకలోని హోస్కోటేలో ఉన్న రివర్ ఫ్యాక్టరీలో తయారవుతుంది.