ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు విచారణను నిరాకరించిందంటూ మీడియాలో వచ్చిన కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రిజిస్ట్రీ సమాచారాన్ని తాను స్వయంగా పరిశీలించానని, ఈ అంశంపై ఒక్క పేజీ పిటిషన్ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేవు సరే సదా, కనీస సమాచారం సరిచూసుకోకుండా బాధ్యతారాహిత్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు పిటిషనే దాఖలు కాలేదు

బాంబే హైకోర్టు తీర్పునకు సంబంధించిన వేరొక కేసును సీనియర్ అడ్వకేట్ షోయబ్ ఆలం ప్రస్తావించిన సమయంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. "గత రెండు రోజులుగా కోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిని ప్రధాన న్యాయమూర్తి విచారించడానికి నిరాకరించారని మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కోర్టులో ఒక్క కాగితం కూడా దాఖలు కాలేదు" అని జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సీజేఐ పేర్కొన్నారు.
న్యాయవాది నరేంద్ర మిశ్రా లేదా మరొకరు పంపిన ఒక ప్రతిపాదన లేఖ మాత్రమే రిజిస్ట్రీకి అందిందని, దానిని పిటిషన్‌గా ఎలా పరిగణిస్తామని సీజేఐ ప్రశ్నించారు. కేవలం ఒక లేఖను పంపి, దానినే రిట్ పిటిషన్‌గా భావించమంటే ఎలా సాధ్యమని మండిపడ్డారు.
హైకోర్టు ఆదేశాలు.. పోలీసుల చర్యలు
జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని న్యాయవాది నరేంద్ర మిశ్రా బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మౌఖికంగా కోరారు. అయితే, వీడియోలు చూడటానికి తమకు సమయం లేదని, అత్యవసర విచారణ జరపలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనినే మీడియా తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసింది.
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లను సురక్షితంగా భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. పోలీసుల చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
{{/usCountry}}మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లను సురక్షితంగా భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. పోలీసుల చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
{{/usCountry}}పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా సంస్కరణలను డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సోనమ్ వాంగ్‌చుక్‌తో మాట్లాడి హామీ ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని, విద్యా సంస్కరణలపై చర్చిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష ముగించారు. అయితే, తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు.