భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ బ్రిటన్ పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జూన్ 4న లండన్ యూనివర్సిటీ పరిధిలోని బిర్క్‌బెక్ కాలేజీలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై లండన్‌లోని భారత హైకమిషన్ శుక్రవారం తీవ్రంగా స్పందించింది. సదరు ప్రేక్షకుల ప్రవర్తనను "అనాగరికం, నిలకడలేనిది" అని అభివర్ణిస్తూ ఖండించింది.

"ప్రజాస్వామ్య సమాజంలో భిన్నాభిప్రాయాలు సహజం. అయితే, వాటిని వ్యక్తపరిచే విధానం నాగరికంగా, గౌరవప్రదంగా ఉండాలి. బహిరంగ చర్చల్లో పాటించాల్సిన కనీస మర్యాదలను ఉల్లంఘిస్తూ ప్రవర్తించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని భారత హైకమిషన్ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో స్పష్టం చేసింది.
అసలేం జరిగింది?
బిర్క్‌బెక్ కాలేజీలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) - అంతర్జాతీయ చట్టం’ అనే అంశంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సదరు మహిళ మైక్ తీసుకుని, తొలుత ఏఐ సాంకేతికత నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భారత రికార్డును ప్రశంసించింది. అయితే ఆ వెంటనే భారతదేశంలో అసమ్మతి, భిన్నస్వరాల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతపై ఆమె ప్రశ్నించడం ప్రారంభించింది. ఇటీవల భారతదేశంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలను (గత నెలలో కోర్టు విచారణలో ఆయన చేసిన బొద్దింకలు, పారాసైట్స్ వ్యాఖ్యలను) ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడింది.
అయితే ఆమె ప్రశ్న పూర్తి కాకముందే స్టేజీపై ఉన్న నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు.
"క్షమించండి, ప్రస్తుత చర్చ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతర్జాతీయ చట్టాలకే పరిమితం. అంశానికి సంబంధం లేని ఈ ప్రశ్నకు మేము సమాధానం ఇవ్వలేం" అని నిర్వాహకులు స్పష్టం చేస్తూ ఆమె టాపిక్‌ను కట్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌తో పాటు మరికొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం రాజుకుంది.
ఏఐ సాంకేతికతపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
తన ఉపన్యాసంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రాబోయే దశాబ్దంలో మనం తీసుకునే నిర్ణయాలే సాంకేతికత, అధికారం, స్వేచ్ఛ, న్యాయాల మధ్య ఉన్న సంబంధాన్ని శాసిస్తాయని చెప్పారు.
{{/usCountry}}తన ఉపన్యాసంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రాబోయే దశాబ్దంలో మనం తీసుకునే నిర్ణయాలే సాంకేతికత, అధికారం, స్వేచ్ఛ, న్యాయాల మధ్య ఉన్న సంబంధాన్ని శాసిస్తాయని చెప్పారు.
{{/usCountry}}సాంకేతికత అనేది స్వతహాగా మంచిది లేదా చెడ్డది కాదని, దానిని సమాజం ఏ చట్టపరమైన, నైతిక చట్రంలో వాడుతుందనే దానిపైనే దాని ప్రభావం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. చట్టం బాధ్యత సాంకేతిక ప్రగతిని అడ్డుకోవడం కాదు, అలాగని దానికి పూర్తిగా లొంగిపోవడం కూడా కాదని, సాంకేతిక అధికారం ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య బద్ధతకు, మానవ గౌరవానికి లోబడి ఉండేలా చూడటమేనని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. అంతర్జాతీయ చట్టాల పరిణామ క్రమంలో ఏఐ ఒక పెద్ద పరీక్ష అని, దీనిని ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసే అవకాశంగా మలచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.