"న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. మేమేమీ మూసి ఉన్న గదుల్లోనో, రాతి మేడల్లోనో కూర్చోవడం లేదు. కోర్టు వెలుపల నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో అన్నీ గమనిస్తున్నాం" అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుకు నిరసనగా అక్టోబర్ 12న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు సుప్రీంకోర్టు వైపు చేపట్టిన 'మార్చ్'పై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంలో చర్యలు కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై నోటీసులు జారీ చేసింది.
కోర్టుల వద్ద నిరసనలపై దాఖలైన పిటిషన్లు
కోర్టు ప్రాంగణాల వద్ద రాజకీయ నిరసనలు, ప్రదర్శనలను నియంత్రించాలని, కోర్టు వైపు ర్యాలీగా వచ్చిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాలపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని పిటిషన్లలో కోరారు.
కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించాలని ఖర్గే, రాహుల్ గాంధీ కోరినప్పటికీ, ఆ అంశాలు ఇప్పటికే న్యాయస్థానంలో పరిశీలనలో ఉన్నందున సీజేఐ ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చారు. దాంతో అక్టోబర్ 12న 'ఇండియా' కూటమి నేతలు, కార్యకర్తలు సుప్రీంకోర్టు వైపు ప్రదర్శనగా బయలుదేరారు.
'ఎవరూ మమ్మల్ని భయపెట్టలేరు'
విచారణ సమయంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఇటువంటి రాజకీయ ప్రదర్శనల ఒత్తిడిని ఎదుర్కొనాల్సి రావడం ఎంతమాత్రం సరికాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర అసంతృప్తి ఉందంటూ, సుమారు 200 మంది లాయర్లు సంతకం చేసిన వినతిపత్రాన్ని కోర్టుకు సమర్పించారు. ఇటువంటి చర్యలు న్యాయ వ్యవస్థను భయపెట్టే యత్నమేనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వాదనలపై సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ స్పందించారు. "న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. ఇలాంటి బెదిరింపు ప్రయత్నాలు చాలా స్వల్పమైనవి. వాటిని ఎవరూ పట్టించుకోరు. కోర్టు వెలుపల ఏం జరుగుతుందో మాకు స్పష్టమైన అవగాహన ఉంది" అని వ్యాఖ్యానించారు.
సీసీటీవీ దృశ్యాలు భద్రపరచాలని ఆదేశం
{{/usCountry}}ఈ వాదనలపై సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ స్పందించారు. "న్యాయ వ్యవస్థను ఎవరూ బెదిరించలేరు. ఇలాంటి బెదిరింపు ప్రయత్నాలు చాలా స్వల్పమైనవి. వాటిని ఎవరూ పట్టించుకోరు. కోర్టు వెలుపల ఏం జరుగుతుందో మాకు స్పష్టమైన అవగాహన ఉంది" అని వ్యాఖ్యానించారు.
సీసీటీవీ దృశ్యాలు భద్రపరచాలని ఆదేశం
{{/usCountry}}ప్రదర్శన సందర్భంగా గర్భంతో ఉన్న పాత్రికేయురాలిని తోసివేశారని, ఆనాటి దృశ్యాలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని గౌరవ్ భాటియా కోరారు. స్పందించిన ధర్మాసనం, అక్టోబర్ 12న జరిగిన ఘటనలకు సంబంధించి సేకరించిన సీసీటీవీ దృశ్యాలు లేదా డిజిటల్ ఆధారాలన్నింటినీ భద్రపరచాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.
మరోవైపు ప్రదర్శన సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు భారతీ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 కింద నాలుగు వేర్వేరు ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేశారు. తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్లో రెండు, మందిర్ మార్గ్, బారాఖంబా రోడ్ పోలీసు స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.