ముంబైలోని ప్రతిష్టాత్మక శివాజీ పార్క్ మైదానంలో నిబంధనలను ఉల్లంఘించి ధర్నా నిర్వహించారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సహవ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి యువత చేపట్టిన ఈ ఉద్యమం ఆగేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
శివాజీ పార్క్‌లో భారీ ఆందోళన

ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శుక్రవారం ముంబైలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ధ్వని కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే కారణంతో పోలీసులు ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ, ఆంక్షలను ధిక్కరించి వేలాది మంది యువతీ యువకులు శివాజీ పార్క్‌కు తరలివచ్చారు. ఈ ఆందోళనలో శబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా, విశాల్ భరద్వాజ్, విశాల్ దాద్లానీ వంటి ప్రముఖ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
సీజేపీ నాయకులపై పోలీసు కేసు
పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా భారీగా జన సమీకరణ చేసి ఆందోళన నిర్వహించారంటూ స్థానిక నివాసి, అడ్వకేట్ సిద్ధి దేఓలేకర్ శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, పార్టీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ పరిణామంపై సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా శనివారం స్పందించిన దిప్కే, "మాపై మరిన్ని కేసులు పెట్టుకోండి, కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మేం పోరాడుతూనే ఉంటాం" అని తేల్చిచెప్పారు.
అక్టోబర్ 10న 'జంతర్ మంతర్ 2.0'
శివాజీ పార్క్ వేదికగా 'జైల్ భరో' నినాదాన్ని ఎత్తుకున్న సీజేపీ, తమ తదుపరి కార్యాచరణను ప్రకటించింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయకపోతే అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా ఉన్న నిరసనకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకుని 'జంతర్ మంతర్ 2.0' పేరుతో భారీ ముట్టడి కార్యక్రమం చేపడతారని దిప్కే వెల్లడించారు.
{{/usCountry}}శివాజీ పార్క్ వేదికగా 'జైల్ భరో' నినాదాన్ని ఎత్తుకున్న సీజేపీ, తమ తదుపరి కార్యాచరణను ప్రకటించింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయకపోతే అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా ఉన్న నిరసనకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు చేరుకుని 'జంతర్ మంతర్ 2.0' పేరుతో భారీ ముట్టడి కార్యక్రమం చేపడతారని దిప్కే వెల్లడించారు.
{{/usCountry}}"స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుకునే ప్రతి పౌరుడూ ఈ శాంతియుత ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసి క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలని, 2025 ఓటర్ల జాబితాను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీజేపీ నేత అజింక్య షిండే డిమాండ్ చేశారు.