...
...
Next Story

భయపడకపోతే విజయం ఖాయం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై CJP నేత అభిజీత్ దిప్కే స్పందన

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడటంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించిన అభిజీత్ దీప్కే, మిగతా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Published on: Jul 25, 2026, 15:18:07 IST
Advertisement

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని వారాలుగా నిరసనలు ఉధృతం చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి ఈ వార్త ఉపశమనం కలిగించింది. శనివారం నిరసన ప్రదేశంలో ఉన్న CJP అధినేత అభిజీత్ దిప్కేకి ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన ఫోన్ కాల్ రాగానే, ఆ వార్తను అక్కడ ఉన్న వేలాది మంది నిరసనకారులతో పంచుకున్నారు.

భయపడకపోతే విజయం ఖాయం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై CJP నేత అభిజీత్ దిప్కే స్పందన (PTI)
భయపడకపోతే విజయం ఖాయం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై CJP నేత అభిజీత్ దిప్కే స్పందన (PTI)

"మనం అనుకున్నది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. భయపడకుండా పోరాడితే విజయం సాధించవచ్చని ఈ పరిణామం నిరూపించింది" అని అభిజీత్ దిప్కే వేదికపై ప్రకటించగానే జంతర్ మంతర్ పరిసరాలు నినాదాలతో హోరెత్తాయి.

అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తోదనడానికి ఈ రాజీనామా నిదర్శనమని, తమ సుదీర్ఘ పోరాటంలో ఇది కేవలం మొదటి విజయం మాత్రమేనని వ్యాఖ్యానించారు.

ఇంకా రెండు డిమాండ్లు మిగిలే ఉన్నాయి

కేంద్ర మంత్రి రాజీనామాతో తమ ప్రాథమిక డిమాండ్ నెరవేరినప్పటికీ, పోరాటాన్ని అప్పుడే ముగించేది లేదని CJP స్పష్టం చేసింది. తమ డిమాండ్ల జాబితాలో ప్రధాన్ రాజీనామా అంశాన్ని టిక్ చేసిన పార్టీ, మిగిలిన రెండు ప్రధాన డిమాండ్లను గుర్తుచేసింది.

  1. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి పరిహారం చెల్లించాలి.
  2. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఉద్యమకారులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు.

"మా దగ్గర మరో రెండు డిమాండ్లు ఉన్నాయి. అవి నెరవేరకుండా మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసేది లేదు. మేం బొద్దింకల లాంటివాళ్లం, ఒక్కసారి లోపలికి ప్రవేశిస్తే అంత సులభంగా బయటకు పోం" అని అభిజీత్ దీప్కే గట్టిగా వ్యాఖ్యానించారు.

లిఖితపూర్వక హామీ వచ్చే వరకు కదిలేది లేదు

మరోవైపు, ప్రధాన్ రాజీనామాపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి లభించిన అతిపెద్ద విజయమని, ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe