...
...
Next Story

CJP Instagram : బ్లాక్.. అన్​బ్లాక్.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ సీజేపీ ఇన్​స్టా అకౌంట్​ చుట్టూ హైడ్రామా!

సోషల్ మీడియాలో హైడ్రామా నెలకొంది! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​ తొలుత బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఫౌండర్ అభిజిత్ దీప్కే తెలిపారు. అనంతరం, కొన్ని గంటల వ్యవధిలో సీజేపీ ఇన్​స్టా పేజ్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది.

Published on: Aug 15, 2026, 10:00:28 IST
Advertisement

స్వాతంత్య్ర దినోత్సవం వేళ సోషల్​ మీడియా వేదికగా హైడ్రామ్ నడుస్తోంది! జంతర్ మంతర్ నిరసనలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కాక్రోచ్ జనతా పార్టీ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​ని మెటా బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ఎక్స్​తో పాటు తన సొంత ఇన్​స్టాగ్రామ్ హ్యండిల్ వేదికగా తెలిపారు. ఈ వార్త వెంటనే వైరల్ అయ్యింది. కాగా దీప్కే పోస్ట్​ చేసిన కొన్ని గంటల అనంతరం సీజేపీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యింది.

అసలేం జరిగింది?

సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే.. (REUTERS)
సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే.. (REUTERS)

దాదాపు 2.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఈ సీజేపీ అకౌంట్​లో శనివారం ఉదయం అకస్మాత్తుగా 'యూజర్ నాట్ ఫౌండ్' అని రావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. దీప్కే ఈ విషయంపై పోస్టు చేశారు.

“కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్​స్టాగ్రామ్ హ్యాండిల్​ని తొలగించారు. బ్లడీ కవర్డ్స్,” అని దీప్కే రాసుకొచ్చారు.

ఎక్స్​లో అభిజిత్ దీప్కే పెట్టిన పోస్టు..

ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత.. తమ ఇన్​స్టా అకౌంట్ పనిచేస్తోందని సీజేపీ స్పష్టం చేసింది.

కాగా.. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్​ మీడియా అకౌంట్లు బ్లాక్, అన్​బ్లాక్ అవ్వడం ఇది తొలిసారి కాదు. మే నెలలో ఇన్​స్టా అకౌంట్ బ్లాక్ అయ్యింది. మళ్లీ తిరిగొచ్చింది.

స్వాతంత్య్ర దినోత్సవం రోజునే 'స్కూల్ ఠీక్ కరో' ఉద్యమం..

మరోవైపు నీట్ నిరసనలతో ఆదరణ పొందిన సీజేపీ ఇప్పుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలను బాగు చేయండి) పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, బాధ్యతాయుత వాతావరణాన్ని మెరుగుపరచడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేసింది.

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్వగ్రామం నుంచి ఈ ఉద్యమం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "నా స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని సర్పంచ్‌ను కోరుతాను. పాఠశాలలో తాగునీరు, బెంచీల వంటి కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాము," అని తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఈ మార్పు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

మారిన పరిస్థితుల్లో కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, విద్యారంగంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థినులు బడులకు వెళ్లడానికి కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోందని, సరైన రోడ్లు కూడా లేవని వస్తున్న వీడియోలను ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే ప్రస్తావించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks