...
...
Next Story

‘జంతర్ మంతర్’ హామీల అమలుపై దిగివచ్చిన కేంద్రం.. సీజేపీ ర్యాలీ రద్దు

నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న తలపెట్టిన ఇండియా గేట్ మార్చ్‌ను విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది.

Published on: Sep 1, 2026, 17:07:17 IST
Advertisement

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరసన తెలిపిన విద్యార్థులకు భారీ ఊరట లభించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అలాగే, మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన నీట్ అభ్యర్థుల కుటుంబాలకు మూడు నెలల వ్యవధిలో నష్టపరిహారం అందిస్తామని వెల్లడించింది. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో సెప్టెంబర్ 5న తలపెట్టిన ఇండియా గేట్ మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మంగళవారం ప్రకటించింది.

సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటన

హామీల అమలుకు కేంద్రం సుముఖంగా ఉండడంతో సెప్టెంబరు 5 నాటి ర్యాలీని రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన సీజేపీ నేతలు (PTI)
హామీల అమలుకు కేంద్రం సుముఖంగా ఉండడంతో సెప్టెంబరు 5 నాటి ర్యాలీని రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన సీజేపీ నేతలు (PTI)

జులై 20 నుంచి జులై 25 మధ్య దేశవ్యాప్తంగా నీట్ నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసేందుకు తమకున్న ప్రత్యేక అధికారాలను (ఆర్టికల్ 142) ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 3 నెలల్లోగా పరిహారం చెల్లిస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి నివేదించారు. మరోవైపు జులైలో జరిగిన సీజేపీ నిరసనలకు సంబంధించి నమోదైన 13 ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ పోలీసులు కూడా కోర్టుకు నివేదించారు.

ర్యాలీ రద్దుపై సీజేపీ స్పష్టత

"కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఇచ్చిన హామీలు, సుప్రీంకోర్టు జారీ చేయనున్న ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 5 నాటి ర్యాలీ పిలుపును విరమించుకుంటున్నాం" అని సీజేపీ సహ-కన్వీనర్, ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. "భారత ప్రభుత్వం ఇచ్చిన సానుకూల హామీలను, న్యాయస్థాన పవిత్రతను గౌరవిస్తూ.. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు తలపెట్టిన శాంతియుత మార్చ్‌ను విరమిస్తున్నాం. కేంద్రం తన హామీలను అమలు చేస్తుందని ఆశిస్తున్నాం" అని సౌరవ్ దాస్ పేర్కన్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe