ప్రస్తుతం టెక్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ప్లాట్‌ఫారమ్ 'క్లాడ్' (Claude) బుధవారం ఒక్కసారిగా మొరాయించింది. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఈ ఏఐ అసిస్టెంట్ వెబ్‌సైట్, చాట్ ఫంక్షన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వెబ్‌సైట్ రూపం అస్తవ్యస్తంగా మారిపోవడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
1995 కాలం నాటి వెబ్‌సైట్‌లా..
డౌన్ డిటెక్టర్ (Downdetector.com) గణాంకాల ప్రకారం.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో (అమెరికాలో మంగళవారం సాయంత్రం) ఈ సమస్య మొదలైంది. సుమారు 3,000 మందికి పైగా యూజర్లు క్లోడ్ సేవలు పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు. క్లాడ్ వెబ్‌సైట్ పరిస్థితిని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
“క్లాడ్ ఏఐ ప్రస్తుతం 1995 కాలం నాటి వెబ్‌సైట్‌లా కనిపిస్తోంది” అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, “నెట్‌స్కేప్ నావిగేటర్ (Netscape Navigator) రోజులు గుర్తుకొస్తున్నాయి” అని మరొకరు ఎద్దేవా చేశారు. మరికొందరైతే, “డెవలపర్లు పొరపాటున CSS ఫైల్‌ను డిలీట్ చేసినట్లున్నారు” అంటూ జోకులు పేల్చారు. వందల కొద్దీ ప్రాజెక్టులు చేస్తున్న వారు తమ డేటా ఎక్కడ పోతుందోనని ఆందోళన చెందారు.
ఆంథ్రోపిక్ సంస్థ వివరణ:
ఈ అంతరాయంపై ఆంథ్రోపిక్ సంస్థ వెంటనే స్పందించింది. ఫిబ్రవరి 18, 2026న క్లాడ్ వెబ్‌సైట్‌లో 'CSS ఎర్రర్స్' (వెబ్‌సైట్ డిజైన్‌కు సంబంధించిన సాంకేతిక లోపం) తలెత్తినట్లు గుర్తించామని పేర్కొంది. సమస్యను పరిశీలిస్తున్నామని చెప్పిన కొద్దిసేపటికే, “లోపాన్ని సరిదిద్దాం, ప్రస్తుతం సేవలన్నీ యధావిధిగా అందుబాటులో ఉన్నాయి” అని స్పష్టం చేసింది. గత 90 రోజుల్లో క్లోడ్ సేవలు 99.6% పైగా సక్సెస్ రేటుతో పనిచేశాయని సంస్థ తన గణాంకాల్లో వెల్లడించింది.
భారీ నిధుల సమీకరణ తర్వాత..
ఈ అంతరాయం కలగడానికి కొన్ని రోజుల ముందే ఆంథ్రోపిక్ సంస్థ తన 'సిరీస్-జి' రౌండ్లో ఏకంగా 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2.5 లక్షల కోట్లు) పెట్టుబడులను సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 380 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం మూడేళ్లలోనే 14 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ టెక్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోంది. ఈ స్థాయిలో ఎదుగుతున్న సంస్థలో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం యూజర్లను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}ఈ అంతరాయం కలగడానికి కొన్ని రోజుల ముందే ఆంథ్రోపిక్ సంస్థ తన 'సిరీస్-జి' రౌండ్లో ఏకంగా 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2.5 లక్షల కోట్లు) పెట్టుబడులను సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 380 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం మూడేళ్లలోనే 14 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ టెక్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోంది. ఈ స్థాయిలో ఎదుగుతున్న సంస్థలో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం యూజర్లను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}ప్రశ్న: క్లాడ్ ఏఐ (Claude AI) ఎందుకు పనిచేయలేదు?
సాంకేతిక పరిభాషలో 'CSS ఎర్రర్స్' వల్ల వెబ్‌సైట్ లోడ్ అవ్వడంలో సమస్య తలెత్తింది. దీనివల్ల వెబ్‌సైట్ డిజైన్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.
ప్రశ్న: ఇప్పుడు క్లాడ్ సేవలు అందుబాటులో ఉన్నాయా?
అవును, ఆంథ్రోపిక్ సంస్థ సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించింది. ప్రస్తుతం చాట్‌బాట్ యధావిధిగా పనిచేస్తోంది.
ప్రశ్న: నా ప్రాజెక్టు లేదా డేటా సురక్షితంగా ఉందా?
ఇది కేవలం వెబ్‌సైట్ డిస్‌ప్లేకు సంబంధించిన సమస్య కాబట్టి, యూజర్ల డేటాకు ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు భావిస్తున్నారు.