...
...
Next Story

త్రిష వివాదంపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం.. జయలలిత ఘటన గుర్తుచేస్తూ కౌంటర్

మహిళలపై వ్యక్తిగత విమర్శలు, అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని ఏమాత్రం సహించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే, ఏఐఏడీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో అసెంబ్లీ సాక్షిగా స్పందించిన ఆయన.. 1989లో జయలలితకు జరిగిన అవమానాన్ని గుర్తుచేశారు.

Published on: Sep 7, 2026, 16:07:42 IST
Advertisement

మహిళలపై పరుష పదజాలం వాడటం, రాజకీయం పేరిట వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని ఎంతమాత్రం సహించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) సాధించిన చారిత్రక విజయంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆయన గుర్తుచేశారు.

అసెంబ్లీ వేదికగా ఘాటు వ్యాఖ్యలు

త్రిష వివాదంపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం.. జయలలిత ఘటన గుర్తుచేస్తూ కౌంటర్
త్రిష వివాదంపై సీఎం విజయ్ తీవ్ర ఆగ్రహం.. జయలలిత ఘటన గుర్తుచేస్తూ కౌంటర్

శాసనసభ వేదికగా సీఎం విజయ్ మాట్లాడుతూ.. "రాజకీయాల్లో ఎవరైనా విమర్శలు చేసుకోవచ్చు, ప్రజలు అన్నింటినీ ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. కానీ రాజకీయం ముసుగులో మన ప్రజలను, ముఖ్యంగా మహిళలను వ్యక్తిగతంగా కించపరుస్తూ దిగజారి మాట్లాడటం సరికాదు. అందరూ భావప్రకటన స్వేచ్ఛను ఎంతవరకు వినియోగిస్తున్నారో ఆలోచించుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు.

తమిళనాడులో ఇటీవల కాలంలో అశ్లీలత, ద్వేషం ఏరులై పారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం, ద్వంద్వార్థాలు ఉన్న పదాలను వాడటం ముమ్మాటికీ తప్పేనని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా 1989లో నాటి ప్రతిపక్షం వల్ల ఇదే అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొన్న ఘోర అవమానాన్ని విజయ్ గుర్తుచేశారు. ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి డీఎంకే సీనియర్ నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కావేరీ జలాల పంపిణీకి సంబంధించి తంజావూరులో జరిగిన ర్యాలీలో జనం త్రిష పేరును ప్రస్తావించినప్పుడు ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయనిధిని చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయం 10 గంటలకు అరెస్టు చేసి తంజావూరుకు తరలించారు. అనంతరం మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఆయన విడుదలయ్యారు. విడుదలయ్యాక ఉదయనిధి స్పందిస్తూ.. "నన్ను కారణం లేకుండా అరెస్ట్ చేశారు, నేను ఎవరినీ ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదు" అని వివరణ ఇచ్చారు.

ఏఐఏడీఎంకే నేతల కౌంటర్లు

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe