హనీమూన్​లో భార్యకు పీరియడ్స్- 'మూడ్​ పోగొట్టావు' అని చితకబాదిన భర్త!

హనీమూన్‌కు వెళ్లిన సమయంలో భార్యకు నెలసరి రావడంతో భర్త ఆమెను విచక్షణా రహితంగా కొట్టి గొంతు నులిమాడు. అదే సమయంలో కట్నం కోసం భర్త కుటుంబసభ్యులు ఆమెను వేధించారు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.

Published on: Aug 17, 2026, 12:20:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హనీమూన్‌కు వెళ్లిన సమయంలో భార్యకు నెలసరి (పీరియడ్స్) వచ్చిందన్న కోపంతో ఆమెను భర్త తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి చంపేయబోయిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణానికి పాల్పడిన మహిళ భర్తతో పాటు అతని తల్లి, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

హనీమూన్​లో భార్యకు పీరియడ్స్- దారుణంగా కొట్టిన భర్త!
హనీమూన్​లో భార్యకు పీరియడ్స్- దారుణంగా కొట్టిన భర్త!

ఇదీ జరిగింది..

గోరఖ్‌పూర్ నగరానికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. దిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో 2023 మే 30న ఆమె వివాహం జరిగింది.

పెళ్లి సమయంలో తన తండ్రి సుమారు రూ. 20 లక్షల నగదు, ఒక కారుతో పాటు మరో రూ. 40 లక్షల విలువైన లాంఛనాలు కట్నంగా ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. తమకు ఇచ్చే వస్తువులు అన్నీ బ్రాండెడ్ అయి ఉండాలని తన అత్తామాలు తేల్చిచెప్పినట్టు వెల్లడించింది.ే

వివాహం జరిగిన కొద్ది రోజులకే, అంటే 2023 జూన్ 2న మహిళ కాపురానికి దిల్లీ వెళ్లింది. అప్పటి నుంచే అత్తమామలు కట్నం తక్కువగా తెచ్చావంటూ ఆమెను నిత్యం వేధించడం, అవమానించడం ప్రారంభించారు.

ఈ వేధింపులు భరించలేకపోతున్న తరుణంలో, వివాహం జరిగిన నెల రోజులకు.. అంటే జులై 4న ఈ దంపతులు హనీమూన్ కోసం అండమాన్ నికోబ్రా దీవులకు వెళ్లారు. ఆ ట్రిప్‌లో ఉన్న సమయంలో ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో పాటు అనుకోకుండా నెలసరి ప్రారంభమైంది.

ఈ విషయం తెలుసుకున్న భర్త నిఖిల్ మిశ్రా విపరీతమైన కోపంతో ఊగిపోయాడు. పీరియడ్స్ వచ్చే విషయాన్ని తనకు ముందే ఎందుకు చెప్పలేదని భార్యను నిలదీశాడు. హనీమూన్ మూడ్‌ను చెడగొట్టింది అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ, ఆమెను చెంపదెబ్బలు కొట్టాడు, కాళ్లతో తన్నాడు, పిడిగుద్దులు గుద్దాడు. అంతేకాకుండా ఆమె గొంతు నులిమి చంపేయడానికి ప్రయత్నించాడు.

మహిళ పెడుతున్న భయానక కేకలు విన్న హోటల్ సిబ్బంది వెంటనే గదిలోకి వెళ్లి ఆమెను రక్షించారు.

కేసు నమోదులో జాప్యం!

ఆ తర్వాత నిఖిల్ తన మామకు ఫోన్ చేసి, వెంటనే వచ్చి తన కూతురిని తీసుకెళ్లాలని, ఆమెతో కలిసి కాపురం చేసేది లేదని తేల్చేశాడు. భర్త తీరుతో కుంగిపోయిన ఆ మహిళ దిల్లీకి తిరిగి వెళ్లిన తర్వాత ఈ దారుణం గురించి అత్త, ఆడపడుచులకు చెప్పింది. అయితే వారు ఆమెను ఓదార్చకపోగా, మరింత మానసిక క్షోభకు గురిచేస్తూ వేధించడం మొదలుపెట్టారు.

పెళ్లయిన కేవలం 45 రోజులకే, అంటే 2023 జులై 14న ఆమెను బలవంతంగా ఇంటి నుంచి గెంటేశారు. ఈ గొడవను సర్దుబాటు చేయడానికి ఆమె తండ్రి స్వయంగా దిల్లీకి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా, అత్తమామలు ఆయన్ని కూడా తీవ్రంగా అవమానించారు.

కట్నంగా ఇచ్చిన బంగారాన్ని, ఇతర విలువైన వస్తువులను వెనక్కి ఇవ్వకపోగా, నిఖిల్ తన భార్యకు నిత్యం బెదిరింపు సందేశాలు పంపుతూనే ఉన్నాడు. న్యాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి చాలా కాలం పాటు ఆమె తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

చివరకు గోరఖ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) డాక్టర్ కౌస్తుభ్ వ్యక్తిగత జోక్యంతో ఎట్టకేలకు శనివారం ఆగస్టు 15న నిందితులపై కేసు నమోదైంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More