Astrology: వివాహం తర్వాత రాజయోగం పొందే రాశులు.. మీ రాశి కూడా ఉందేమో చూడండి!
వృషభ, కర్కాటక, సింహ, మకర, తులా, మీన రాశుల వారికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వచ్చి, కెరీర్, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.
పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, ఇద్దరు వ్యక్తుల జీవిత ప్రయాణం కూడా. భాగస్వామి తోడు ఉంటే జీవితంలో ఏదైనా సులువుగా సాధించొచ్చు. భాగస్వామి తోడుతో కొత్త అధ్యాయం మొదలవుతుంది. జ్యోతిష్యం ప్రకారం వివాహం జరిగిన తర్వాత కొందరి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. పెళ్లి తర్వాత అదృష్టం వరించడంతో పాటు కెరీర్, ఆర్థిక పరిస్థితి కూడా దూసుకుపోతాయి. మరి ఆ రాశులు ఎవరో, ఆ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈ రాశుల వారికి పెళ్లి తర్వాత విపరీతమైన అదృష్టం.. తలరాత మారిపోతుంది!
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి పెళ్లి తర్వాత చాలా మార్పు వస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని ఈ రాశి వారు కోరుకుంటారు. పెళ్లి తర్వాత వీరి జీవితంలోకి వచ్చే భాగస్వామి వీరికి కొండంత అండగా నిలుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటిదాకా నెరవేరని కలలు కూడా నెరవేరుతాయి. భాగస్వామి సపోర్ట్‌తో అద్భుతంగా జీవనాన్ని సాగిస్తారు. వృత్తి జీవితంలో మీరు చేసే కష్టానికి తగ్గ ఫలితం కనబడుతుంది.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి పెళ్లి తర్వాత ఊహించని మార్పులు వస్తాయి. సహజంగానే భావోద్వేగపూరితమైన కర్కాటక రాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వివాహ బంధం ఈ రాశి వారి జీవితంలో క్రమశిక్షణను, స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. సామాజిక బాధ్యతలపై ఇంకా శ్రద్ధ పెట్టగలరు. సరైన సమయం రాగానే శక్తియుక్తులను పూర్తిగా ఉపయోగించి ఆశించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అందుకుంటారు.
3.సింహ రాశి
సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రభావవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి పెళ్లి తర్వాత అదృష్టం పెరుగుతుంది. ఈ రాశి పురుషులకు వారి భార్యలు లక్ష్మీ ప్రసన్నంగా మారి ఇంట్లో సానుకూల మార్పులను తెస్తారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యక్తిగత లక్ష్యాలను కూడా సులువుగా చేరుకుంటారు.
4.మకర రాశి
ఈ రాశి వారు కష్టపడి పని చేస్తారు. క్రమశిక్షణతో ఉంటారు. పెళ్లి తర్వాత వీరికి అర్థం చేసుకునే భాగస్వామి లభిస్తారు. వీరి జీవితంలో ఇది గొప్ప మలుపు. కష్టాన్ని గుర్తించే తోడు దొరకడంతో లక్ష్యాలను వేగంగా చేరుకుంటారు. వీరి బంధంలో ఉండే పరస్పర నమ్మకం, ఆప్యాయత అభివృద్ధికి పునాదిగా మారుతుంది.
5.తులా రాశి
తులా రాశి వారు కళ, అందం, సమతుల్యతను ఇష్టపడతారు. పెళ్లి తర్వాత ఈ రాశి వారి జీవితంలో స్పష్టత ఇంకా పెరుగుతుంది. భాగస్వామి ప్రోత్సాహం వీరికి బలంగా ఉంటుంది. దీంతో వృత్తిపరంగా కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. భాగస్వామి చేసే సలహాలు, సూచనలు కీలకంగా మారతాయి.
6.మీన రాశి
మీన రాశి వారికి కల్పనా శక్తి, దూరదృష్టి ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేస్తారు. పెళ్లి తర్వాత వారి ఆలోచనలకు, శ్రమకు కొత్త దిశ లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు భాగస్వామితో కలిసి కేవలం కలలనే కాదు, నిజ జీవితంలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. పరస్పర సహకారంతో విజయాలను అందుకుంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


