Love Astrology: మీ భాగస్వామి రాశి ఏంటి? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసా?

Love Astrology: ప్రేమ బంధం పటిష్టంగా ఉండాలంటే భాగస్వాముల మధ్య మానసిక పొంతన చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాలను బట్టి మీ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో ఈ కథనంలో తెలుసుకోండి.

Published on: May 19, 2026, 10:00:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి లేదా ప్రేమ అనేది ఒక మలుపు లాంటిది. కొంతమంది జంటలను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారు. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే రాశిచక్రాల మధ్య ఉండే తత్వాల వలన ఇలా జరగవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రేమిస్తున్న వ్యక్తి లేదా జీవిత భాగస్వామి రాశి ప్రకారం మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీరు కూడా ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూద్దామనుకుంటున్నారా? మరి ఇక పూర్తిగా చదివేసేయండి.

Love Astrology: మీ భాగస్వామి రాశి ఏంటి? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసా? (pinterest)
Love Astrology: మీ భాగస్వామి రాశి ఏంటి? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసా? (pinterest)

అగ్నితత్వ రాశులు

మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశులను అగ్నితత్వ రాశులు అంటారు. ఈ రాశుల వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. మీ భాగస్వామి కూడా ఇదే తత్వానికి చెందినట్లయితే మీ మధ్య బంధం బాగుంటుంది. మీ బంధంలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశుల వారు సాహసాలను ఎక్కువగా ఇష్ట పడతారు. అయితే అగ్నితత్వానికి చెందిన రాశుల వారికి చిన్నపాటి అహంకారం ఉంటుంది. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గితే మాత్రం బంధం ఆనందంగా సాగుతుంది.

భూతత్వ రాశులు

కన్యా రాశి, వృషభ రాశి, మకర రాశి వారు భూతత్వానికి చెందిన వారు. ఈ రాశుల వారు చాలా వాస్తవికంగా ఆలోచిస్తారు. అలాగే స్థిరత్వం అంటే ఈ రాశుల వారికి చాలా ఇష్టం. మీ భాగస్వామి కూడా ఈ రాశుల్లో ఉన్నట్లయితే మీ మధ్య బంధం చాలా బాగుంటుంది. భావోద్వేగాల కంటే బాధ్యతలకు ఈ రాశుల వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటారు.

వాయు తత్వ రాశులు

కుంభ రాశి, తులా రాశి, మిథున రాశి వారు వాయు తత్వానికి చెందినవారు. ఈ రాశుల వారు బాగా కమ్యూనికేట్ చేయగలరు. అలాగే ఇద్దరి మధ్య మాటలు, చర్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశుల వారు స్వతంత్రంగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. భాగస్వామికి స్వేచ్ఛను కూడా ఇస్తారు. బంధాన్ని ఆనందంగా, సరదాగా ముందుకు తీసుకువెళ్తారు. ఈ రాశుల వారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రయాణాలు అంటే కూడా ఈ రాశుల వారికి మహా ఇష్టం.

జలతత్వ రాశులు

వృశ్చిక, కర్కాటక, మీన రాశి వారు జలతత్వానికి చెందినవారు. వీరు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ప్రేమను, అనురాగాన్ని పంచడంలో వీరికి మించిన వారు ఎవరు ఉండరని చెప్పొచ్చు. భాగస్వామి ఈ రాశికి చెందినట్లయితే చెప్పకుండానే మీ మనసులో మాటను వారు బాగా అర్థం చేసుకుంటారు. మీ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు చిన్న విషయాలకు కూడా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎవరికి కెమిస్ట్రీ బాగా ఉంటుంది?

ఒకే తత్వానికి చెందిన రాశుల వారికి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అగ్ని, వాయు తత్వాల మధ్య.. భూమి, జల తత్వాల మధ్య అవగాహన బాగుంటుంది. జాతక చక్రంలో లగ్నం, చంద్రుడి స్థితిని బట్టి కూడా కెమిస్ట్రీలో మార్పులు ఉంటాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More