UGC NET December రిజిస్ట్రేషన్‌కు ఈ రోజే లాస్ట్ ఛాన్స్- పూర్తి వివరాలు..
UGC NET December 2025 application : నేటితో యూజీసీ నెట్ డిసెంబర్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముగింపు పడనుంది! దరఖాస్తు ప్రక్రియ, డైరక్ట్ లింక్, ఫీజు సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే CSIR UGC NET డిసెంబర్ 2025 పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో, అంటే అక్టోబర్ 24 2025, శుక్రవారంతో ముగియనుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నిర్వహించే ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్ఈటీ) రాయడానికి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ డిసెంబర్ 2025- దరఖాస్తు ఫీజు వివరాలు..
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
జనరల్ కేటగిరీ అభ్యర్థులు: రూ. 1150
జనరల్-ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) కేటగిరీ అభ్యర్థులు: రూ. 600
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / పీడబ్ల్యూబీడీ / థర్డ్ జెండర్ అభ్యర్థులు: రూ. 300
ఈ ఫీజును నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ విండో ముగిసిన తర్వాత కూడా అభ్యర్థులు అక్టోబర్ 25, 2025 రాత్రి 11:50 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చేయవచ్చు.
యూజీసీ నెట్ డిసెంబర్ 2025- దరఖాస్తు సవరణకు అవకాశం..
దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా తప్పులు జరిగితే, వాటిని సరిదిద్దుకోవడానికి ఎన్టీఏ అవకాశం కల్పిస్తుంది. అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 29, 2025 రాత్రి 11:50 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో తెరిచి ఉంటుంది.
యూజీసీ నెట్ డిసెంబర్ 2025- పరీక్ష తేదీ, విధానం..
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను డిసెంబర్ 18, 2025న నిర్వహించనున్నారు.
విధానం: పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు.
సమయాలు: పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.
మొదటి షిఫ్ట్: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
రెండో షిఫ్ట్: మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు.
భాష: పరీక్ష ద్విభాషా రూపంలో అంటే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో ఎంచుకున్న మాధ్యమం ప్రకారం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక: అనువాదం కారణంగా హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో ఏమైనా తేడాలు ఉంటే, ఇంగ్లీష్ వెర్షన్‌నే ఫైనల్‌గా పరిగణిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.
యూజీసీ నెట్ డిసెంబర్ 2025 పరీక్షా నగర వివరాలు, అడ్మిట్ కార్డుల గురించి ఎన్టీఐ త్వరలో సమాచారం అందిస్తుంది.
CSIR UGC NET డిసెంబర్ 2025- దరఖాస్తు చేసే విధానం..
అభ్యర్థులు ఈ కింది సులభమైన దశలను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు:
ముందుగా, అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ను సందర్శించండి.
హోమ్ పేజీలో కనిపించే 'Joint CSIR UGC-NET 2025 రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయండి.
మీ వివరాలను నమోదు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి.
ఫారమ్‌ను ఒకటికి రెండుసార్లు సరి చూసుకుని, సబ్మిట్ చేయండి.
కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటౌట్‌ను మీ వద్ద ఉంచుకోండి.
యూజీసీ నెట్ డిసెంబర్ దరఖాస్తుకు సంబంధించిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎన్టీఏ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించడమైనది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


